హైదరాబాద్అక్టోబరు 9, (way2newstv.com)
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సోమాజిగూడ ప్రెస్క్లబ్లో అఖిలపక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఆర్టీసీ జేఏసీ నేతలు, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్ధామ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను వాడుకొందని, ఇవి ఇవ్వడం లేదన్నారు. రూ. 2 వేల 400 కోట్లు ఇస్తే ఆర్టీసీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు. డీజిల్ ధర రూ. 30 పెరిగిందని, దీంతోపాటు ట్రాన్స్ పోర్టు వ్యవస్థలో డీజిల్ పై ట్యాక్స్ విధిస్తున్నారన్నారు. ఆర్టీసీలో 27 శాతం పన్ను ఉందన్నారు. కొన్ని ట్యాక్స్లు తగ్గిస్తామని..గతంలో సీఎం కేసీఆర్ చెప్పారని అయన గుర్తు చేశారు. తమ కోసం ఆర్టీసీ సమ్మె చేపట్టడం లేదని, సంస్థ కోసం చేస్తున్నట్లు వెల్లడించారు.
అసహనంతో ముఖ్యమంత్రి కేసీఆర్
సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు..ప్రజా రవాణాను బతికించుకోవడానికి తమ పోరాటం చేస్తున్నామని అయన అన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే..త్వరలో తెలంగాణ బంద్కు పిలుపునిస్తామన్నారు.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంఘాలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీడీపీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలకు ఎయిర్ బస్‌పై ఉన్న ప్రేమ ఎర్రబస్సుపై లేదని, సీఎం ఆలోచన విధానంలో మార్పు రావాలన్నారు. ఆర్టీసీపై కేసీఆర్ ఈస్ట్ మన్ కలర్ సినిమా చూపిస్తున్నారని రావుల అన్నారు.భేటీకి హజరయిన సీపీఎం కార్యదర్శి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ కేసీఆర్‌కు కార్మిక చట్టాలు తెలియవా? అని ప్రశ్నించారు. కేరళలో ఆర్టీసీకి సీపీఎం ప్రభుత్వం చాలా చేసిందని, ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న వసతులన్నీ.. కేరళలో ఆర్టీసీ కార్మికులకు అందుతున్నాయని అన్నారు. నష్టాలను కేరళ ప్రభుత్వమే భరిస్తోందని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కార్మికులకు సీపీఎం పార్టీ మద్దతు వుంటుందని అయన అన్నారు.