సూర్యాపేట అక్టోబర్ 18 (way2newstv.com)
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబడేలా.. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో ప్రజలు తీర్పు ఇవ్వాలని మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి కోరారు. జాన్‌పహాడ్‌లో ఉత్తమ్, రేవంత్ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతిని గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాలి: రేవంత్‌రెడ్డి
ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తేనే కేసీఆర్ ప్రజల వైపు చూస్తారన్నారు. టీఆర్‌ఎస్ వ్యతిరేకుల ఓట్లు చీలకుండా... టీడీపీ, బీజేపీ, సీపీఎం, టీజేఏసీ పార్టీల ప్రజలు చేతిగుర్తుకే ఓటెయ్యాలని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల బంధువులంతా కాంగ్రెస్‌కే ఓటు వేయాలన్నారు.