నన్నయ్య యూనివర్సిటీలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నన్నయ్య యూనివర్సిటీలో మహిళా కమిషన్ చైర్ పర్సన్

రాజమహేంద్రవరం అక్టోబరు 16, (way2newstv.com)
ఇంటర్నల్ మార్కుల  పేరుతో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోవాలని అనుకునే  గురువులు ఎవరైనా సరే భయపడే విధంగా చర్యలు ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. అందుకు ఆ ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంగ్లీష్ విభాగాధిపతి రాఘవేంద్ర పై తీసుకున్న చర్యల ఉదాహరణలుగా నిలవాలని అన్నారు.
 నన్నయ్య యూనివర్సిటీలో మహిళా కమిషన్ చైర్ పర్సన్

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో మాట్లాడుతూ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకునేందుకు యూనివర్సిటీ కి వచ్చిన ఆమె ఎమ్ ఏ ఇంగ్లీష్ విద్యార్థులు అధ్యాపకులు వైస్ ఛాన్స్లర్ వేరువేరుగా సమావేశమై వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.