మైండ్ గేమ్ ఆడుతున్న కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మైండ్ గేమ్ ఆడుతున్న కేసీఆర్

జయశంకర్ భూపాలపల్లి అక్టోబరు 25,  (way2newstv.com)
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ఆర్టీసీ ఐకాస  ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఎం (ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాయల చంద్రశేఖర్ హాజరయి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా  తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ  20 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది ప్రభుత్వం.  హుజూర్ నగర్ లో జరిగిన ఎన్నికలు సమ్మెకు సంబంధం లేదు.  హుజూర్ నగర్ గెలుపుపై కేసీఆర్  నీచంగా మాట్లాడుతున్నాడని అన్నారు.  ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన వారు ఇదే ఆర్టీసీ కార్మికులు అని కేసీఆర్ పేర్కొన్నారు.  ఇప్పుడు పనికిరాని సమ్మెలు అంటున్నాడు.  
మైండ్ గేమ్ ఆడుతున్న కేసీఆర్

కార్మికులను ,ఉద్యోగులను పనికిరాని వాళ్ళు అంటున్నాడు.  రాజకీయ నాయకులు ఆర్టీసీ  యూనియన్లు రెచ్చగొడుతున్న సమ్మెలు అంటున్నాడు. ఆర్టీసీ నష్టానికి యూనియన్లు కారణం అంటున్నాడు.  కానీ ఆర్టీసీ నష్టానికి ప్రభుత్వం కారణమని అన్నారు. ఆర్టీసీ మీద పన్నులు వసూలు చేస్తున్నది ఈ ప్రభుత్వం. దేశంలో ఎక్కడా కూడా ఈ విధంగా లేదుని అన్నారు.  ఈ ప్రభుత్వం ఆర్టీసీ కి 2800 కోట్ల బాకీ ఉంది.  అనేక రాష్ట్రాలలో ఆర్టీసీ కి రాయితీలు ఇస్తున్నాయి. మరి నువ్ ఎం ఇచ్చావని ప్రశ్నించారు. ఆర్టీసీ  కార్మికులు ప్రభుత్వంలో విలీనం చేయమని తప్పు కాదు.  కార్మికులకు 50,000 జీతాలు వస్తున్నాయని అంటున్నాడు.  పిచ్చి కేసీఆర్ వారి జీతాలు చూసి మాట్లాడు. ఇలాంటి అబద్దాలు చేయటం వలన తెలంగాణ ప్రజలు నమ్మరు. కేరళ ప్రభుత్వం ప్రతి బడ్జెట్ లో 1000 కోట్లు కేటహిస్తున్నది.  ఆర్టీసీ లో జరుతున్న సమ్మెలోఅన్ని యూనియన్లు సమ్మె చేస్తుంటే పోలీసులు డబుల్ డ్యూటీ చేస్తున్నారని అన్నారు.  భూస్వాముల చరిత్రను పాతర పెట్టిన చరిత్ర ఎర్ర జెండాది.  కేసీఆర్  80,000 పుస్తకాలు చదివాను అంటాడు. ముఖ్యమంత్రి ఈ రూలు ప్రకారం కార్మికులను డిస్మిస్ చేసాడని అన్నారు.కేసీఆర్  మైండ్ గేమ్ అడుతున్నాడు. ఆర్టీసీ కార్మికులు విలీనం అనే కోరికను వదులుకున్నది అని ప్రచారం చేస్తున్నాడు.  హై కోర్టు చర్చలు జరిపమని చెప్తే ఇప్పటి వరకు చర్చలకు పిలవలేదు.  ప్రజల మద్దతు ఉన్న ఉద్యమంతో పెట్టుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని కోర్టు స్పష్టంగా చెప్పింది.  ప్రజల మద్దతు ఉందని తెలపడానికి ఉదాహరణగా మొన్న జరిగిన తెలంగాణ బంద్ అని చెప్పవచ్చు.  ఇన్ని రోజుల నుండి సమ్మె చేస్తుంటే ఒక్కరు కూడా కార్మికులను తిట్టలేదని అన్నారు.