సీఎం పై నిప్పులు చిరిగిన విజయశాంతి
హైదరాబాద్ అక్టోబర్ 5 (way2newstv.com);
దసరాను రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యమైన పండుగగా భావిస్తాయని కానీ, ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసిపండుగ జరుపుకోలేకపోతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ స్థితికి కేసీఆర్ మొండివైఖరేకారణమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి.‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న... ఒడ్డు దిగినాక బోడి మల్లన్న’ అనే తీరుగావ్యవహరించే కెసిఆర్ గారి సహజ స్వభావం మరోసారి రుజువయ్యిందన్నారు సీఎం కేసీఆర్. నిరంకుశ ధోరణితో తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారని మండిపడ్డారు తెలంగాణ ఉద్యమసమయంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులను కెసిఆర్ గారు దూరం పెట్టేశారు.
ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్ నిరంకుశ ధోరణి సరికాదు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారి కుటుంబాలను సీఎం గాలికివదిలేశారన్నారు. తన మాటే నెగ్గాలని, ఎదురు తిరిగితే అణచివేయాలన్న ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనకు మద్దతుగా నిలిచి ఉద్యమాన్ని నడిపించినఉద్యోగులు, విద్యార్థులపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన ఆధిపత్య ధోరణి ఆయన నిజస్వరూపాన్నిబయటపెట్టిందన్నారు.తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాడిన ప్రభుత్వ ఉద్యోగులను సైతం కించపరుస్తూ కేసీఆర్ గారు కామెంట్లు చేయడం 'దొర'హంకారానికిఅద్దంపడుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తన మాటను లెక్క చేయకపోతే... ఉద్యోగుల అంతు తేలుస్తాం అంటూ కెసిఆర్ గారు వార్నింగ్ ఇచ్చే ముందు.. గతంలో సకల జనుల సమ్మెసందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రజలకు ఏమీ చేయకపోయినా కూడా వచ్చే 10 ఏళ్ళు కూడా తాను సీఎంగాకొనసాగుతానని ఎవరో కొందరు జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని కెసిఆర్ గారు బాగా నమ్మినట్టు ఉన్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు. ఎలాంటి జాతకాన్ని అయినా మార్చగలిగే శక్తిప్రజలకు ఉంటుందన్న విషయాన్ని కెసిఆర్ గారు గుర్తు పెట్టుకుంటే మంచిది. అందరికీ ఆనందాన్ని దూరం చేసి, తాను మాత్రం తన కుటుంబంతో దసరా పండుగను జరుపుకోవాలనికేసీఆర్ భావిస్తున్నారని, ఇది ఆయన దొరతనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ తీరుపై మరోమారు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని విజయశాంతి హెచ్చరించారు.