'ఒరేయ్‌ బుజ్జిగా' సెట్‌లో డైరెక్టర్‌ కొండా విజయ్‌కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

'ఒరేయ్‌ బుజ్జిగా' సెట్‌లో డైరెక్టర్‌ కొండా విజయ్‌కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

'గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు తాజాగా యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా 'ఒరేయ్‌ బుజ్జిగా' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ పుట్టినరోజు అక్టోబర్‌ 21. ఈ సందర్భంగా 'ఒరేయ్‌ బుజ్జిగా' సెట్‌లో కొండా విజయ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. యూనిట్‌ సభ్యుల నడుమ కేక్‌ కట్‌ చేశారు కొండా. హీరో రాజ్‌తరుణ్‌, నిర్మాత కె.కె.రాధామోహన్‌, హీరోయిన్‌ మాళవిక నాయర్‌, నటి వాణీ విశ్వనాథ్‌, నటులు సత్యం రాజేష్‌, మధునందన్‌, సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూలతోపాటు యూనిట్‌ సభ్యులంతా కొండా విజయ్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
'ఒరేయ్‌ బుజ్జిగా' సెట్‌లో డైరెక్టర్‌ కొండా విజయ్‌కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ ''మా దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెట్‌లో యూనిట్‌ సభ్యులందరి నడుమ ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరగడం చాలా హ్యాపీగా ఉంది. 'ఒరేయ్‌ బుజ్జిగా' షూటింగ్‌ నాన్‌ స్టాప్‌గా జరుగుతోంది. ఒక డిఫరెంట్‌ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. డైరెక్టర్‌గారు చాలా బాగా ఈ కథను తెరకెక్కిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా మా బేనర్‌లో మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని పోసాని కృష్ణ మురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.