ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ అక్టోబర్ 18 (way2newstv.com)
ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్‌ను పాక్ ఉపయోగించుకుంటోందని, పాకిస్థాన్, కాంగ్రెస్‌కు మధ్య ఉన్న భావసారూప్యత ఏమిటని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. హర్యానాలోని సోనిపట్ జిల్లాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ స్వచ్ఛభారత్ గురించి కానీ, సర్జికల్ దాడుల గురించి కానీ తాము మాట్లాడితే కాంగ్రెస్‌కు కడుపునొప్పు వస్తోందని, బాలాకోట్ గురించి ఎవరైనా మాట్లాడితే ఉక్రోశం వస్తోందని అన్నారు.
కాంగ్రెస్‌కు, పాక్ మధ్య ఉన్న భావసారూప్యత ఏమిటి?
కాంగ్రెస్‌ను ఉపయోగించుకుని అంతర్జాతీయంగా తమ వాదనను బలం పెంచుకునే ప్రయత్నం పాకిస్థాన్ చేస్తోందని ఆరోపించారు. ఇదెలాంటి భావసారూపత్యత అని ఆయన ప్రశ్నించారు.కాంగ్రెస్‌పై ప్రధాని మరిన్ని విమర్శలు చేస్తూ, వ్యవసాయం, క్రీడల్లోనూ కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని తప్పుపట్టారు. కాంగ్రెస్ అవకతవకల పాలనలో జవాన్లు కానీ, రైతులు కానీ క్రీడాకారులు కానీ ఎవరూ సురక్షితంగా లేరఅని అన్నారు. సోనిపట్ జిల్లాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ప్రతిరంగంలోనూ భారతదేశం గర్వించే ప్రాంతమిదని, అవి కుస్తీలు కావచ్చు, ఉగ్రవాదంపై పోరుకావచ్చు, దేశమంతా గర్విస్తోందని అన్నారు. సోనిపట్ అంటే , కిసాన్, జవాన్, పెహల్వాన్ అని అభివర్ణించారు.