దుర్గమ్మను‌ దర్శించుకున్న దేవినేని ఉమ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దుర్గమ్మను‌ దర్శించుకున్న దేవినేని ఉమ

విజయవాడ అక్టోబరు 3, (way2newstv.com)
దుర్గమ్మను‌ మాజీ మంత్రి దేవినేని ఉమ దర్శనం చేసుకున్నారు. క్యూ లైన్‌లో నడుచుకుంటూ‌ వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈసారి అధికార పార్టీ నేతలహడావుడే ఎక్కువుగా కనిపించిందని ఆరోపించారు. ఫ్లెక్సీలు ఎక్కువ పని తక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వంద రూపాయల టిక్కెట్లను వీఐపీ ముద్రలు వేసిఅమ్ముకుంటున్నారని విమర్శించారు. ఏ మంత్రి అండదండలతో ఇదంతా జరుగుతుందని ప్రశ్నించారు. 
దుర్గమ్మను‌ దర్శించుకున్న దేవినేని ఉమ

అమ్మవారి టిక్కెట్లను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. సాధారణ భక్తులు‌ మాత్రంగంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం రాజమార్గంలో‌ వెళ్తున్నారన్నారు. ప్రజల ఆదాయాలు తగ్గిపోయాయి.. రోజు గడవటమేకష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈసారి దసరా ఉత్సవాలకు భక్తులు సంఖ్య తగ్గిందన్నారు. దాతలు ఇచ్చిన సొమ్ములో అరవై కోట్లు ఉన్నాయన్నారు.‌ ఆ వడ్డీతో మంచి భోజనంపెట్టాలని కోరారు.