హైద్రాబాద్, అక్టోబరు 24, (way2newstv.com)
దీపావళి పండుగ అనగానే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన బొమ్మల కొలువు, చీకటీలను పారద్రొలేందుకు ఇంటి ముందు వెలిగించే అందమైన ప్రమిదల దీపాలు, వివిధ తీపి వంటకాలు. టపాసుల మోతలు గుర్తుకు వస్తాయి. ఇంట్లో దీపావళి పండుగను సంతోషంగా కుటంబ సభ్యులతో కలసి ఆహ్లాదకరంగా జరుపుకునేందుకు పండుగ రోజు అందమైన బొమ్మల కొలువుతో పా టు అందమైన ప్రమీదలను మహిళలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. మహిళల అభిరుచికి అనుగునంగా కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయియిగూడ, ఏఎస్‌రావునగర్, ఈసిఐఎల్, చక్రీకిపురం తదితర ప్రాంతాల్లో అందమైన బొమ్మలు, ప్రమిదలు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
మార్కెట్ కు దీపావళి శోభ
దీపావళి పండుగ సందర్భంగా వేలిగించే ప్రమిదలు, అందమై న బొమ్మలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కాప్రా స ర్కిల్లోని పలు ప్రాంతాల్లో ప్రమిదలు, బొమ్మలు విక్రహించేందు కు ప్రత్యేక షాపులు వెలిశాయి. ఈ షాపుల్లో అందంగా తయా రు చేసిన వివిద ఆకృతులలో ప్రమిదలు, ప్రతిమలు, దొంతు లు అందమైన బొమ్మలు విశేష ంగా అకట్టుకుంటున్నాయి. ధ్వజస్తంబాలు, ఎనుగులు, స్వ స్తిక్, కమళం, గుర్రలు, ఒంటె లు, నేమలి, పూలతోరనాలు, దేవత మూర్తుల ప్రతిమలు అ మ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి అందమైన ప్రతిమలు, ప్రమిదలను తీసుకువచ్చి విక్రహిస్తున్నారు. దింతో కొనుగోలు దారులతో ఈ ప్రాంతమంత సందడి నెలకొంది.దీపావలి పండుగ కోసం మిఠాయి, టపాసుల దుఖానాలు ప్ర త్యేకంగా వెలిశాయి. సర్కిల్ పరిదిలోని ఏఎస్‌రావునగర్ మైదానం, కుషాయిగూడ వేంకటేశ్వర ఆలయం, ఈసిఐఎల్, చక్రిపురం, చర్లపల్లి, మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ, కాప్రా, మల్లాపూ ర్, నాచారం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక టపాసులు, మిఠాయిలు షాపులు వెలిశాయి.