కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలకు ఫైల్ సిద్ధం చేయండి: కేసీఆర్ ఆదేశాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలకు ఫైల్ సిద్ధం చేయండి: కేసీఆర్ ఆదేశాలు

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం
రెండు రోజుల్లో ఫైల్ సిద్ధం చేయనున్న రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి
ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
హైదరాబాద్ అక్టోబరు 9 (way2newstv.com)
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలకు కసరత్తు చేయాలని అధికారులనుఆదేశించారు. ఈ నేపథ్యంలో, రెండు రోజుల్లో ఈ నియామకాలపై రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఫైల్ ను సిద్ధం చేయనున్నారు. 
కొత్త కండక్టర్లు, డ్రైవర్ల నియామకాలకు ఫైల్ సిద్ధం చేయండి: కేసీఆర్ ఆదేశాలు

అనంతరం కొత్త కండక్టర్లు, డ్రైవర్లనియామకాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విధులకు హాజరుకాని ఆర్టీసీ ఉద్యోగులంతా వారంతట వారే సెల్ఫ్ బర్తరఫ్ అయినట్టేనని కేసీఆర్ ఇదివరకే ప్రకటించిన సంగతితెలిసిందే. సమ్మెతో ప్రభుత్వాన్ని బెదిరించలేరని ఆయన స్పష్టం చేశారు.