వైఎస్ జగన్ ను కలవనున్న చిరంజీవి

అమరావతి అక్టోబర్ 10 (way2newstv.com)
 కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్ మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారు. తాను కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ని వీక్షించడానికి రావాల్సిందిగా  సీఎం జగన్ను చిరంజీవి కోరనున్నారు. 
వైఎస్ జగన్ ను కలవనున్న చిరంజీవి

జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి తొలిసారి ఆయనతో భేటీ కాబోతున్నారు. ‘సైరా’ సినిమాను వీక్షించాల్సిందిగా తెలంగాణ  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను చిరంజీవి ఇటీవల కోరడం, ఆమె కుటుంబంతో కలిసి సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ ప్రశంచిన విషయం తెలిసిందే. తొలితరం స్వాతంత్ర్య  పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై సినీ ప్రముఖులతోపాటు  రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం.
Previous Post Next Post