ఏపీలో కరెంట్ కొరత నిజమే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో కరెంట్ కొరత నిజమే

విజయవాడ, అక్టోబరు 3, (way2newstv.com)
ఏపీని విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ప్రభుత్వం చెబుతోంది.. బొగ్గు సరఫరాపై కేంద్రం, తెలంగాణ ముఖ్యమంత్రికి సీఎం జగన్ లేఖలు కూడా రాశారు. అలాగే కేంద్రం నుంచి సహకారం తీసుకుంటున్నారు.. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యుత్ కొరతపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉన్న మాట వాస్తవమేనన్నారు మంత్రి. 
ఏపీలో కరెంట్ కొరత నిజమే

విద్యుత్ కొరత, మిగిలిన సమస్యలపై.. కేంద్రం, తెలంగాణతో చర్చలు జరుపుతున్నామని బొత్స చెప్పారు. త్వరలోనే సమస్యల్ని పరిష్కారమవుతాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందన్నారు బొత్స. ఇటు ఇసుక కొరత కొత్త పాలసీ అమల్లోకి వచ్చాక తగ్గిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్నారు.చంద్రబాబుకు గ్రామ సచివాలయాల ఆలోచన వస్తే ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు బొత్స. ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. త్వరలోనే ఆస్పత్రుల దగ్గర క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు చేస్తున్నామన్నారు మంత్రి.