చక్ర బంధనంలో వంశీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చక్ర బంధనంలో వంశీ

విజయవాడ, అక్టోబరు 24, (way2newstv.com)
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ఏ నిముషానికి ఏం జ‌రుగునో అనేలా అనేక‌ ప‌రిణామాలు నేత‌ల‌ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఆయా స‌మ‌యాల్లో ఈ నేత‌లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. అధికార ప‌క్షంలోని నేత‌ల‌తో ఉన్న స‌న్నిహిత సంబంధాల‌తో బ‌య‌ట‌ప‌డిన సంద‌ర్భాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేష‌న్‌నే టీడీపీకి చెందిన నాయ‌కుడు, కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నుంచి రెండోసారి విజ‌యం సాధించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌పై స్థానిక వైసీపీ నేత‌లు తీవ్ర యుద్ధం ప్ర‌క‌టించారు.
చక్ర బంధనంలో వంశీ

ఎన్నిక‌ల‌కు ముందు గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ధ్యేయంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ న‌కిలీ ప‌ట్టా కాగితాల‌ను స్థానిక ప్ర‌జ‌ల‌కు పంచి, వారిని నిలువునా మోసం చేశార‌ని పేర్కొంటూ.. వైసీపీ నాయ‌కులు వంశీపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆయ‌న‌పై కేసులు కూడా పెట్టారు. ప్ర‌స్తుతం ఇది తీవ్ర రూపం దాల్చి, కేసు నిరూప‌ణ అయితే, వ‌ల్ల‌భ‌నేని వంశీ పై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయ‌న‌ను ఎవ‌రు ర‌క్షిస్తారు ఎవ‌రు ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేస్తారు అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తి క‌ర విష‌యం తెర‌మీదకి వ‌చ్చింది. వైసీపీలో ఉన్న కీలక నాయ‌కుడు, ఇదే జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అప్ర‌తిహ‌త విజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్న కొడాలి నాని ప్ర‌స్తుతం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. ఈయ‌న‌కు, వ‌ల్ల‌భ‌నేని వంశీ కి మ‌ధ్య చాలా స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో టీడీపీలోనే ఉన్న నానికి, వ‌ల్ల‌భ‌నేని వంశీ కి మ‌ధ్య ఆత్మీయ స్నేహంకూడా ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఎన్నిక‌ల‌కు ముందు వ‌ల్ల‌భ‌నేని వంశీ ని పార్టీ మారి వైసీపీలోకి రావాల‌ని నాని కోరిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే, వ‌ల్ల‌భ‌నేని వంశీ దీనికి అంగీక‌రించ‌లేదు. అది వేరే సంగ‌తి. అయితే, ఇరువురు చెరో పార్టీలో ఉన్నా.. ఇద్ద‌రికి మ‌ధ్య చ‌క్క‌ని అవ‌గాహ‌న ఉంది.ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ ని నాని ఆదుకుంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలాగూ.. టీడీపీలో గెలిచినా.. గ్రూపు రాజ‌కీయాల‌తో తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న వ‌ల్ల‌భ‌నేని వంశీ త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ల‌కు కూడా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ నాని సాయంతో పార్టీ మారిపోయే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంద‌ని చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. ఇక‌, ఆయ‌న ఈ కేసు నుంచి బ‌య‌ట ప‌డ‌డం ఈజీయేన‌ని చెబుతున్నారు. మ‌రి మంత్రి నాని.. త‌న స్నేహితుడికి ఎలా సాయం చేస్తారో చూడాలి. వ‌ల్ల‌భ‌నేని వంశీ విష‌యంలో నాని ఏ సాయం అయినా చేసేందుకు రెడీగా ఉన్నార‌ని చెపుతున్నారు. మ‌రి వంశీ విష‌యంలో ప‌రిణామాలు ఎలా ? మార‌తాయో ? చూడాలి.