కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగులో ధర్నా రాస్తారోకో - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగులో ధర్నా రాస్తారోకో

ములుగు అక్టోబర్ 31(way2newstv.com):
 ములుగు జిల్లా  కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో  జాతీయ రహదారి పై  రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందించాలని కోరుతూ ధర్నా,  రాస్తోరోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి. ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. సీతక్క  మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ప్రభుత్వం రైతులపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని,  ధరణి వెబ్ సైట్ లో ఉండి పట్టా పాసుపుస్తకాలు ఉంటె గాని  రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని అనడం బాధాకరమని అన్నారు.  
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ములుగులో ధర్నా రాస్తారోకో

రైతులకు ములుగు జిల్లా లో పట్టా పాసుపుస్తకాలు రాక తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రైతులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అన్నారు. సాదా బై నామా ద్వారా పట్టాలు వస్తాయని అనుకున్న రైతులకు నిరాశే తప్ప రైతులకు ఒరిగింది ఏమి లేదని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఏక కాలంలో లక్ష రూపాయల రుణ మాఫీ చెయ్యాలని ములుగు నియోజకవర్గం లో పోడు చేసుకున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని అమె డిమాండ్ చేశారు.  ఇటీవల కురిసిన భారీ వర్షాల  కారణంగా  ములుగు జిల్లా లో  తీవ్ర  స్థాయిలో పంట నష్టం వాటిల్లిందని వెంటనే అధికారులు అప్రమత్తమై పంట నష్టాన్ని  అంచనా వేసి రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని అన్నారు.  తడిచిన ప్రతి గింజను  ఎలాంటి  ఆంక్షలు లేకుండా ఐకేపీ ల ధ్వారా ప్రభుతం కొనుగోలు చెయ్యాలని ఈ సందర్బంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమములో  కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు  గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,  మండల అధ్యక్షుడు  ఎండీ చాంద్ పాషా, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బానోత్ రవిచందర్ ఇతర నాయకులు పాల్గోన్నారు.