కొనసాగుతున్న మెగా మానియా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొనసాగుతున్న మెగా మానియా

ఏలూరు, అక్టోబరు 2  (way2newstv.com)
బాహుబలి వచ్చింది మొదలు భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రేక్షకుల్లో క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా సినిమాలంటే బాగా మోజు మీద ఉండే గోదావరి జిల్లాల్లో ఇది మరీ ఎక్కువ. అందులోను మెగా ఫ్యామిలీ చిత్రాలను తొలి రోజే చూసే కసి ఇక్కడి ఫ్యాన్స్ ప్రత్యేకత. దాంతో ఇప్పుడు అన్ని థియేటర్లు సైరా అని గర్జిస్తున్నాయి. ఎక్కడ చూసినా చిరంజీవి తొలిసారి చారిత్రక నేపధ్యం వున్న చిత్రంలో నటిస్తూ ఉండటంతో మెగాస్టార్ ను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఉరకలేస్తున్నారు అభిమానులు.సైరా చిత్రం కోసం గోదావరి జిల్లాల థియేటర్లు ప్రత్యేక అలంకరణలతో సిద్ధం అయిపోయాయి. మెగాస్టార్ వీరాభిమానులు తమ హీరో కటౌట్ లు ఫ్లెక్సీలతో హంగామా గట్టిగానే చేస్తున్నారు. ఎక్కడ చూసినా సైరా సందడి అంబరాన్ని తాకుతుంది. 
కొనసాగుతున్న మెగా మానియా

కటౌట్ లకు పూలదండలు పాలాభిషేకాలు మొదలు పెట్టి తమ అభిమానాన్ని కురిపించేస్తున్నారు మెగా ఫ్యాన్స్. కొన్ని చోట్ల తమ హీరో చిత్రం హిట్ కావాలని గుళ్ళు గోపురాలు చుట్టూ రౌండ్స్ కొడుతున్నారు. ఇక కొబ్బరి కాయల మొక్కులకు కొదవే లేదు. దసరా ఉత్సవాల్లో సైతం అమ్మవారికి సైరా హిట్ కావాలంటూ పూజలు చేసేస్తున్నారు. మెగా మానియా తో గోదావరిలా ఉప్పొంగిన అభిమానం పైనే ఇప్పుడు గట్టి టాక్ నడుస్తుంది. మరి చిరంజీవి తాజా చిత్రం ఫ్యాన్స్ అంచనాలు ఏ మేరకు అందుకుంటుందో చూడాలి. మరో వైపు భారీ అంచనాలు మధ్యన భారీ గా విడుదలైన సై రా సినిమా మీద ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరు సినిమా కావడం అందులో నయనతార, అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా లాంటి స్టార్స్ ఉండడంతో.. సై రా మీద ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ ఏర్పడింది. ఇక ఇప్పటికే పూర్తయిన యుఎస్ ప్రీమియర్స్ టాక్ ద్వారా సినిమా.. బావుందని, మెగాస్టర్ చిరు, సై రా నరసింహారెడ్డి బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చాడని, గోసాయి వెంకన్నగా నరసింహా రెడ్డి గురువు పాత్రలో అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు.అలాగే మెగాస్టార్ మరియు నయనతారల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సూపర్ అని, ఆ ఎమోషనల్ సన్నివేశాల్లో నయనతార నటన అదుర్స్ అంటున్నారు. తమన్నా కూడా తన నటనతో ఆకట్టుకుందని… సై రా పాత్రలో మెగాస్టార్ ని తప్ప మరెవరిని వుహించలేమంటున్నారు.ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి కి ఏమాత్రం టచ్ లేని సబ్జెక్టు తో సినిమా తీసినా.. సై రా సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని, అయితే సినిమా ఫస్ట్ హాఫ్ కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదిగా మొదలవుతున్నట్టు అనిపించినా… ఇంటర్వెల్ వచ్చేసరికి మెగాస్టార్ కు ఎలాంటి ఎలివేషన్లు ఇస్తే మాస్ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అవుతారో అలాంటి ఎలివేషన్స్ తో సినిమాని లేపారంటున్నారు. ఇక సినిమాకి నిర్మాణ విలువలతో పాటుగా, సినిమాటోగ్రఫీ అద్భుతమని, అమిత్ త్రివేది అందించిన పాటలు ఒక్క టైటిల్ ట్రాక్ బావున్నప్పటికీ… మిగతా పాటలు పర్వాలేదనిపిస్తాయి. కానీ జూలియస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్సెస్ లో సూపరని అంటున్నారు. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ స్లో గా ఉండడం, కమర్షిల్ ఎలిమెంట్స్ లేకపోవడం మైనస్ లుగా చెబుతున్నారు