శిశు విహార్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శిశు విహార్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు వేడుకలు

హైదరాబాద్ అక్టోబర్ 31 (way2newstv.com):
మహిళా శిశు సంక్షేమ శాఖలోని శిశు విహార్ లో పిల్లలకు స్వీట్లు తినిపించి తన పుట్టిన రోజు వేడుకలను మంత్రి సత్యవతి రాథోడ్ జరుపుకున్నారు. ఇక నుంచి ఇక్కడున్న ప్రతి శిశువు పుట్టిన రోజుకు వారికి కొత్త బట్టలు కొట్టించి, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసే బాధ్యత తీసుకుంటున్న అని చెప్పారు. అక్కడే ఉంటున్న వీణ-వాణిలను కలిసి వారికి స్వీట్లుతినిపించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ... “ఒక గిరిజన తండాలో పుట్టిన సామాన్య మహిళను చరిత్ర గుర్తుంచుకునేలా, బంగారు తెలంగాణలో శాశ్వతంగా నిలిచేలా రాష్ట్ర తొలి మహిళా మంత్రిని చేసి, నేను పుట్టిన గిరిజన సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించి, నిండు మనసుతో దీవిస్తూ, నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, నన్ను ఆశీర్వదించి, నిత్యం అన్నివిధాల అండగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్న మార్గదర్శి, స్పూర్తిప్రదాత  ముఖ్యమంత్రి కేసిఆర్ కి మనస్పూర్తిగా ధన్యవాదాలు’’ తెలిపారు.
శిశు విహార్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పుట్టిన రోజు వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప చేసి, సాంకేతిక రంగంలో, ఐటి రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సమర్ధవంతమైన నాయకత్వంతో మమ్మల్ని ముందుండి నడిపిస్తూ, నా బాధ్యతల నిర్వహణలో విలువైన సలహాలిస్తూ, ప్రోత్సహిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అన్న మంత్రి రామన్నకు కృతజ్ణతలు తెలిపారు.అతి తక్కువ సమయంలో రాజ్యసభ సభ్యులుగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును సాధించుకుని, ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకుని రాష్ట్రంలో హరితహారం విజయవంతం కావాలని, కేవలం రాష్ట్రానికే పరిమితం కాకూడదని, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా హరితహారం గొప్పదనాన్ని ప్రచారం చేస్తూ ’’ గ్రీన్ చాలెంజ్’తో సమాజంలోని అందరని హరితహారంలో భాగం చేస్తూ సమాజం పచ్చగా ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని కోరుకునే సంతోష్ అన్న నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, గ్రీన్ ఛాలెంజ్ లో నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు.ఈ గ్రీన్ ఛాలెంజ్ లో నేడు శిశు విహార్ లో నేను, నా కొడుకులిద్దరూ సునిల్, డాక్టర్ సంతోష్ మూడు మొక్కలను నాటుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇటీవల అనేక కార్యక్రమాల్లో మొక్కలు నాటుతూ హరితహారంలో పాల్గొన్నప్పటికీ…ఈ గ్రీన్ చాలెంజ్ లో నేడు భాగస్వామ్యం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నా తరపున మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మహబూబాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందును ఈ గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేస్తున్నాను.నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నా మార్గదర్శకులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులందరికీ పేరు పేరునా కృతజ్ణతలు. మీ ప్రేమ, ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అనంతరం శిశు విహార్ ఆవరణలో గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలు నాటారు.