ఐదు నెలల్లో జగన్ ఇంటి ఖర్చు 15 కోట్లా

విజయవాడ, నవంబర్ 7, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంపై రగడ మొదలయ్యింది. జగన్ తాడేపల్లిలో ఉన్న తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకున్నారు.. అయితే ఈ ఇంటికి, రోడ్డు, భద్రత కోసం ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. తాజాగా జగన్ నివాసానికి కిటికీలు, తలుపులు కోసం రూ.73లక్షలు విడుదల చేస్తూ జీవో రావడంతో ఈ వివాదం మొదలయ్యింది. 
ఐదు నెలల్లో జగన్ ఇంటి ఖర్చు 15 కోట్లా

నిన్న మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్‌పై విమర్శలు చేయగా.. తాజాగా చంద్రబాబు టార్గెట్ చేశారు. రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్లు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.చంద్రబాబు తన ట్వీట్‌లో ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో ఫిడేల్ వాయించినట్లు.. గత ఐదు నెలలుగా ఏపీ అసలే ఆర్థిక లోటుతో ఉంది.. అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏపీ నీరో జగన్ మాత్రం.. ప్రభుత్వ సొమ్ము 15.65కోట్లు ఖర్చు చేసిన తన రాజభవనం (ఇంట్లో) కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్నారు.. షాకింగ్ ’అంటూ చంద్రబాబు సెటైర్లు పేల్చారు.
Previous Post Next Post