తిరుపతి నవంబర్ 16 (way2newstv.com)
టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో నవంబరు 17వ తేదీ ఆదివారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ సీతా రాముల కల్యాణం వైభవంగా జరుగనుంది.
ఈ నెల రు 17న శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం
ఈ సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్సేవ నిర్వహిస్తారు.