30 రోజుల్లో వంద శాతం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

30 రోజుల్లో వంద శాతం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి
 ఉద్యమంలా నిర్మాణాలు జరగాలి
సిరిసిల్ల   నవంబర్ 02 ,(way2newstv.com):
గ్రామాల్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తప్పని సరిగా నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా  కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్  పేర్కొన్నారు. ప్రజా ప్రతి నిధులు పూర్తీ సహకారం అందించి ప్రతి గ్రామంలో వచ్చే 30 రోజుల్లో వంద శాతం ఇంకుడు గుంతలు నిర్మాణం  పూర్తయ్యే లా చూడాలన్నారు . శనివారం గంభీ రావుపేట , ముస్తాబాద్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో  ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం పై ప్రజా ప్రతినిధులు , ఈజీఎస్  సిబ్బంది , సెల్ఫ్ హెల్స్  సంఘాల ప్రతినిధులు , అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మీ అందరి సహకారం వల్లే స్వచ్చ దర్ఫన్ లో జిల్లా దేశ స్థాయిలో ప్రథమ స్థానం పొందిందన్నారు . 30 రోజుల గ్రామ ప్రణాళిక లో విజయవంతం అయ్యిందన్నారు  . 
30 రోజుల్లో వంద శాతం   ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలి

పారిశుద్ధ్యం , హరిత హారం విషయంలో మంచి ఫలితాలు సాధించామన్నారు . అదే స్ఫూర్తి తో    జిల్లాలో వంద శాతం ఇంకుడు గుంతలు నిర్మాణం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు .ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చునని అన్నారు. భూగర్బ జల మట్టం పెరిగి  భవిష్యత్తులో నీటి సమస్యను లేకుండా చూడ వచ్చునని తెలిపారు . మురుగు నీటి కాలువల వల్ల కలిగే సమస్యలు దూరమై పారిశుద్ధ్యం మెరుగు పడుతుందన్నారు . సీజనల్ వ్యాధులు లేకుండా చూడవచ్చునన్నారు . ఇంకుడు గుంటలు నిర్మించుకున్న వారికి నెలన్నర వ్యవధిలో డబ్బులు వచ్చేలా చూస్తామన్నారు . గోళాలు స్థానిక గ్రామాలు ,లేదా సమీప గ్రామల నుండి కొనుగోలు చేయాలన్నారు .  ఇంకుడు గుంతల నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలన్నారు . ఇంకుడు గుంతల నిర్మాణంలో ప్రతి దశలో జిల్లా యంత్రాంగం  ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు . కట్టగలిగిన ప్రతి చోట ,ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించాలన్నారు . మెటీరియల్ , క్షేత్ర స్థాయిలో  ఏమైనా ఇబ్బందులు ఉంటె తమ దృష్టికి తీసుకువస్తే  వెంటనే పరిష్కరిస్తా మన్నారు . ఇంకుడు గుంతల ప్రగతి ని పరిశీలించి ప్రతి గ్రామానికి ర్యాంకు లు కేటాయిస్తంన్నారు . ఇంకుడు గుంతల నిర్మాణం వంద శాతం పూర్తీ చేసిన గ్రామాల ప్రజా ప్రతినిధులను వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సన్మానం చేస్తామన్నారు . రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు దక్కేలా చూస్తామన్నారు .ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పని చేసి ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయ్యేలా చుఅడాలని అన్నారు .పారిశుద్ధ్యం బాగుంటే ..పందులు బాధలు ఉండవు పారిశుద్ధ్యం  అస్తవ్యస్త  పరిస్థితులు   పందులకు ఆలవాలంగా మారుతయన్నారు . పారిశుద్ధ్యం బాగుంటే పందుల బాధలు ఉండవన్నారు . ఇంకుడు గుంతల తో మురుగునీరు డ్రై నేజీ లలో చేరదన్నారు . తద్వారా పందులు బాధ ఉండదన్నారు . సిరిసిల్ల లో జిల్లా ఏర్పడిన కొత్తలో పందులు ఇబ్బంది ఉండేదన్నారు . క్రమేణా పారిశుద్ధ్యం మెరుగు పడేకొద్ది పందులు సంఖ్య తగ్గి ఇబ్బందులు దూరమయ్యయని అన్నారు . పారిశుద్ధ్యం మెరుగు పడేందుకు ప్రజా ప్రతినిధులు ,స్థానిక అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే పందుల వల్ల కలిగే ఇబ్బందులు దూరమవుతయన్నారు .