హైదరాబాద్ నవంబర్ 22, (way2newstv.com)
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. మొత్తం 11 చార్జిషీటులకు సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత తదుపరి విచారణను డిసెబంర్ 6 వ తేదికి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ డిసెంబర్ 6కి వాయిదా
ఏ-1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. కేవలం ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ మాత్రమే హాజరయ్యారు.15 రోజుల క్రితం జగన్కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడం సాధ్యంకాదని, ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అయన అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నందున ఆయన కోర్టుకు హాజరు కాలేరంటూ జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.