పవన్ ను ఎంత తెడితే..అక్కడ అంత ప్రమోషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ ను ఎంత తెడితే..అక్కడ అంత ప్రమోషన్

కాకినాడ, నవంబర్ 5, (way2newstv.com)
సామాన్య జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి రాజకీయంగా అత్యున్నత శిఖరాలకు చేరుకోవడం లో మెగాస్టార్ చిరంజీవి తొలిసారి పెట్టిన రాజకీయ భిక్షే కారణమని మంత్రి అయినవెంటనే కన్నబాబు వినమ్రంగా మీడియా ముందు ప్రకటించారు. వైఎస్ జగన్ నమ్మకంతో ఇచ్చిన బాధ్యత సక్రమంగా కొనసాగిస్తా అంటూ నాడు పేర్కొన్నారు. కట్ చేస్తే పవన్ కల్యాణ్ వైసిపి పై ఎప్పుడు విమర్శలు చేసినా ఆ పార్టీ నుంచి కన్నబాబు వెంటనే రియాక్ట్ అయ్యి పవర్ స్టార్ గాలి తీసే పనిలో వుంటున్నారు. ఇది పార్టీ నుంచి వచ్చిన ఆదేశాలు అయినప్పటికీ కన్నబాబు మాట్లాడే మాటలు జనసేన కు నేరుగా ముఖ్యంగా పవన్ కల్యాణ్ ని కలవరపెడుతున్నాయి. తాజాగా విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ పై కన్నబాబు విమర్శలు పవన్ కల్యాణ్ గట్టిగా చేశారు.
పవన్ ను ఎంత తెడితే..అక్కడ అంత ప్రమోషన్

టిడిపి దత్తపుత్రుడు 2014 నుంచి ఆ పార్టీతో లాంగ్ మార్చ్ చేస్తూనే ఉన్నాడంటూ వ్యంగ్యం గా వాగ్బాణాలు సంధించారు.పవన్ విశాఖ సభలో వైసిపి పార్టీపై చేసిన విమర్శల్లో జగన్ తరువాత కన్నబాబు, విజయసాయి రెడ్డిలపై విరుచుకుపడ్డారు. అందులో కన్నబాబు ను ప్రత్యేకించి విమర్శించడం గమనార్హం. సామాన్యుడు కన్నబాబు స్థాయి మరిచి వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను జనసేనను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ఎమ్యెల్యే అంబటి రాంబాబు, రోజా వంటివారు ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు. అయితే వీరిలో బొత్స పేరు ప్రస్తావించి విజయసాయి పై తన మాటల దాడి ని మరల్చారు పవన్ కల్యాణ్. మిగిలిన వారిని విడిచిపెట్టి కురసాల నే టార్గెట్ చేసుకున్నారు.వాస్తవానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కన్నబాబు ను అంత వ్యక్తిగతంగా టార్గెట్ చేసే స్థాయి కాదు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడం వెనుక కొందరు ఆడిన మైండ్ గేమ్ తన అన్నయ్యపై పని చేసిందని పవన్ కల్యాణ్ నమ్ముతారని అంటారు. అందులో కన్నబాబు పాత్ర చాలావుందని పవన్ కల్యాణ్ కి ఆయన కోటరీ నూరిపోయడంతో అప్పటినుంచి కసిపెంచుకున్నట్లు టాక్. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కల్యాణ్ కి సుతరాము ఇష్టం లేదు. ఈ విషయంపై అన్నతో సైతం తమ్ముడు పవన్ విభేదించారు అంటారు. అలాగే పీఆర్పీ లో టికెట్ల అమ్మకం నాడు కొందరు జోరుగా వెనుక ఉండి నడిపించారని అందులో పైసా ఖర్చు లేకుండా చిరంజీవితో వున్న సాన్నిహిత్యం కన్నబాబుకు ఎమ్యెల్యే టికెట్ ఇప్పించిందని, అలాగే ఆ పార్టీలో గెలిచిన అతికొద్దిమందిలో కురసాల మెగా దయతో ఎమ్యెల్యే అయ్యి అన్నయ్యకు దెబ్బకొట్టారని బలంగా మనసులో పెట్టుకున్నట్లు ప్రచారాం నడుస్తుంది. వీటన్నిటితో బాటు జనసేన నెలకొల్పినప్పుడు నాడు అన్నయ్యతో నడిచినవారంతా తనవెంట ఉంటారని భావిస్తే వారే తన ప్రధాన ప్రత్యర్ధులు కావడాన్ని పవన్ కల్యాణ్ ఇప్పటికి జీర్ణించుకోలేకే బయట పడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇదంతా ఎలా వున్నా పవన్ కల్యాణ్ తో వైరం పెరిగేకొద్ది కురసాల అంతే స్థాయిలో వైసిపి లో ఎదుగుతూ ఉండటం రాజకీయాల్లో నెగిటివ్ పాజిటివ్ గా ఎలా మారుతుందో చాటిచెబుతుందని చూపుతున్నారు పొలిటికల్ పండితులు.