భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్

న్యూఢిల్లీ, నవంబర్ 14 (way2newstv.com)
భారతీయ ఐటీ కంపెనీలకు.. ఉద్యోగులకు అమెరికా షాకిస్తోంది. ఎందుకంటే.. ఐటీ కంపెనీలు అప్లై చేసే హెచ్ వన్ బీ వీసాల్ని రిజెక్టు చేసే దేశాల్లో భారత్ ముందుండటమే దీనికి కారణం. భారతీయ ఐటీ కంపెనీలకు చెందిన వీసా దరఖాస్తుల్ని పెద్ద ఎత్తున రిజెక్ట్ చేస్తున్న వైనాన్ని తాజాగా గుర్తించారు.అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం..భారత ఐటీ కంపెనీలకు జారీ చేసే హెచ్ 1బీ వీసాల్ని జారీ చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.  ఇందులో భాగంగా పలు ఐటీ కంపెనీలను ఈ వీసాలు పొందే సంస్థల జాబితా నుంచి తొలగించిన షాకింగ్ నిజం బయటకు వచ్చింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో (అక్టోబరు - జూన్) దాదాపు నాలుగు వంతుల అప్లికేషన్లను రిజెక్టు చేశారు. 
భారతీయ ఐటీ కంపెనీలకు అమెరికా షాక్

2015 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు వీసా తిరస్కరణ మూడు రెట్లు పెరిగినట్లుగా గుర్తించారు. హెచ్ 1 బీ వాసీ కలిగి ఉన్న వారి సంఖ్యలో దాదాపు 70 శాతం భారీయులు ఉన్న నేపథ్యంలో వీసాల విషయంలో మరింత కఠినంగా ఉండాలని అమెరికా భావిస్తున్నట్లు చెబుతున్నారు.భారత ఐటీ కంపెనీలకు జారీ చేసే వీసాల విషయంలో నిబంధనల్ని మరింత కఠినంగా అమలు చేయటంతో పాటు.. తన ప్రమాణాల్ని సైతం మార్చుకోవటంతో రిజెక్ట్ రేటు భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా వీసాల్ని రిజెక్టు చేసిన ఐటీ కంపెనీల జాబితాలో ఉన్న కొన్ని కంపెనీల పేర్లు బయటకు వచ్చాయి. వాటిల్లో..
అజిమెట్రీ ఇన్ కార్పొరేషన్
బుల్ మెన్ కన్సల్టెంట్ గ్రూపు ఇన్ కార్పొరేషన్
బిజినెస్ రిపోర్టింగ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ఇన్ కార్పొరేషన్
నేటేజ్
కెవిన్ ఛాంబర్స్
ఇ-యాప్పైర్ ఐటీ ఎల్ఎల్ సీ తదితర కంపెనీలు