దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన

గద్వాల జోగులాంబ నవంబర్ 12, (way2newstv.com)
గద్వాల నియోజకవర్గంలో కె.టి దొడ్డ మండలంలోని  గువ్వల దీన్నే  గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో  ధ్వజస్తంభం ప్రతిష్టాపన  కార్యక్రమం ఘనంగా జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గద్వాల  ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు  గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.  శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో  నూతన ధ్వజస్తంభ ప్రతిష్టించిన తరువాత అయన  ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయంలో  ధ్వజస్తంభం ప్రతిష్టాపన  

ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా గువ్వల దీన్నే గ్రామంలో   నూతన  ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయడం  శుభసూచకం. గ్రామంలోని రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వుండాలని అయన కోరుకున్నారు.  పాడి పరిశ్రమల అభివృద్దికి రైతులు కృషి చేయాలి తెలిపారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి.  ప్రతి ఒక్కరూ దైవం పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని కోరారు. జిల్లా లోని ఉత్తమ గ్రామ పంచాయతీ ఏర్పాటు దిశగా  కృషి చేయాలి తెలిపారు. ఈ కార్యక్రమం లో  జెడ్పిటిసి రాజశేఖర్, ఎంపీపీ విజయ్, సర్పంచ్, ఎంపిటిసి, తెరాస పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఉరుకుందు గోపాల్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు