గవర్నర్ ను కలిసిన పవన్ కళ్యాణ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గవర్నర్ ను కలిసిన పవన్ కళ్యాణ్

అమరావతి నవంబర్ 12, (way2newstv.com)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను మంగళవారం కలిసారు  రాష్ట్రంలో ఇసుక సమస్యను పవన్ కల్యాణ్  గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో కార్మికుల ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పవన్ కల్యాణ్ గవర్నర్ కు తెలిపారు. 
గవర్నర్ ను కలిసిన పవన్ కళ్యాణ్

గవర్నర్తో ఆయన దాదాపు అరగంట పాటు చర్చించారు.రాష్ట్రంలో ఇసుక సరఫరాను పునరుద్ధరించాలని, తద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని పవన్  గవర్నర్ ను కోరారు. నూతన ఇసుక ప్రణాళికను వెంటనే ప్రవేశపెట్టాలని ఇటీవల జనసేన పార్టీ లాంగ్ మార్చ్ నిర్వహించిందని, అయినప్పటికీ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని చెప్పారు. బతుకు దుర్భరమై దయనీయ స్థితిలో గడుపుతోన్న 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల వెతలను ఓ లేఖలో వివరిస్తూ గవర్నర్ కు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా అందజేశారు..