సిక్స్త్ సెన్స్ లో దుమ్ము రేపిన సుమ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిక్స్త్ సెన్స్ లో దుమ్ము రేపిన సుమ

హైద్రాబాద్, నవంబర్ 5 (way2newstv.com)
యాంకర్ సుమ బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక ఆడియో వేడుకలు, సినిమా ఫంక్షన్లు అయితే సుమ లేకుండా జరగనే జరగవు. పర్ఫెక్ట్ టైమింగ్‌తో గలగలా మాట్లాడుతూ.. ఎక్కడా ద్వందార్ధాలు, హేళనలు లేకుండా పద్దతిగా పురుష పదజాలం వాడకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సుమ తరువాతే ఎవరైనా. అందుకే ఆమె యాంకర్లందరికీ అక్క అయ్యింది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సుమ యాంకర్లలో టాప్ అనే పేరును సార్ధకం చేసుకుంటూనే ఉంది.అయితే ఈ మధ్య కాలంలో అనసూయ, రష్మి, శ్రీముఖిల నుండి గట్టి పోటీ ఉండటంతో అప్పుడప్పుడూ వాళ్ల దారిలో వెళ్తూ డబుల్ మీనింగ్ డైలాగ్‌‌లనూ వదులుతూ కొత్త మార్క్ కోసం తాపత్రయ పడుతోంది.
సిక్స్త్ సెన్స్ లో దుమ్ము రేపిన సుమ

తాను యాంకరింగ్ చేసే కార్యక్రమాలను టాప్‌లో నిలబెట్టడమే కాకుండా.. టాప్ షోలలో సైతం స్పెషల్ గెస్ట్‌గా వెళ్లే రేంజ్‌కి వెళ్లింది సుమ. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లి సందడి చేసిన సుమ తాజాగా ఓంకార్ సిక్స్త్ సెన్స్ కార్యక్రమంలో సందడి చేస్తుంది.ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 3 ఈ నెల 9 నుండి ప్రసారం కానుంది. నవంబర్ 9 నుండి స్టార్ మాలో 9 గంటలకు ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.ఇందులో సుమ హడావిడి మామూలుగా లేదు. ఓంకార్ తలకు గన్‌ను గురిపెట్టి ఓ రేంజ్‌లో బిల్డప్ ఇస్తుండగా.. ఆమెతో పాటు అలీ, బ్రహ్మాజీ, మంచులక్ష్మి, శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, ముక్కు అవినాష్‌లు ఫుల్ ఫన్ కామెడీతో రచ్చ రచ్చ చేస్తున్నారు. వాళ్లతో ఫన్నీ టాస్క్‌‌లు ఆడిస్తున్న ఓంకార్.. వన్ సెకన్ అనడంతో ‘ఎవడైనా ఫస్ట్‌ నైట్‌కి గదిలోకి వెళ్లేటప్పుడు వన్ సెకెన్.. ఆల్ ది బెస్ట్ అంటాడా వాడికి’ అంటూ పంచ్‌లేస్తుంది సుమ. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 3 ముగియడంతో స్టార్ మా అదే టైంలో సిక్స్త్ సెన్స్ సీజన్ 3ని మొదలుపెట్టారు. మరి ఈ షో ప్రేక్షకులకు ఎంతవరకూ చేరువౌతుందో చూడాలి.