ఇసుక అక్రమాలపై కన్నెర్ర - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇసుక అక్రమాలపై కన్నెర్ర

విజయవాడ, నవంబర్ 18  (way2newstv.com)
ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. కొత్త పాలసీ అమలుతో పాటూ ఇసుక అక్రమంగా రవాణా చేసేవారిపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వ, అధిక ధరల విక్రయ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టారు. ఇసుక రవాణాలో అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్‌ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నంబర్ ద్వారా అధికారులతో సీఎం మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కాల్‌ సెంటర్‌ ఉద్యోగులకు కొన్ని సూచనలు చేశారు.
ఇసుక అక్రమాలపై కన్నెర్ర

ఇసుక విషయంలో రాజీనే లేదని చెబుతున్న ప్రభుత్వం.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని చెబుతోంది. ఇప్పటికే గత బుధవారం జరిగిన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినా.. అధిక ధరలకు అమ్మినా.. రెండేళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. కేబినెట్‌లో ఈ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రారంభించారు.టోల్ ఫ్రీ నంబర్ మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న వారోత్సవాలను ప్రారంభించారు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక స్టాక్ పాయింట్లను ప్రారంభించారు. ఇక నదుల్లో వరద తగ్గుముఖం పడటంతో ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. త్వరలోనే అన్ని సమస్యలు తీరిపోతాయంటోంది.