స్కూళ్లలో ఔట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్కూళ్లలో ఔట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్

వరంగల్, నవంబర్ 19, (way2newstv.com)
‘ఔట్ఆఫ్ ద బాక్స్’ఐడియాలు కావాలనే మాట మనం వింటూ ఉంటాం.. ఇప్పుడు ట్రైబల్వెల్ఫేర్స్కూళ్లల్లో ‘ఔట్ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్’అనే మాట ఎక్కువగా వినపడుతోంది. ఎప్పుడు టెక్స్ట్బుక్స్తో కుస్తీ పట్టడం కాకుండా.. ఇతర విషయాలపైనా స్టూడెంట్లలో నాలెడ్జ్పెంచడం, వారిలోని ప్రతిభను వెలికి తీసి పదును పెట్టడం, పరీక్షలంటే ఉన్న భయాన్ని తరిమేయడం ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం. ప్రతి అంశాన్ని స్టూడెంట్ల కళ్లకు కట్టినట్టు చెప్పడంతోపాటు స్ఫూర్తినిచ్చే సినిమాలు చూపిస్తూ వారిలో పాజిటివ్‌‌ థింకింగ్‌‌ పెంచుతున్నాయి ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌ ఈ లెర్నింగ్‌‌ స్కూళ్లు. మారుమూల ప్రాంతాల్లో ఆశ్రమాల్లో ఉండి చదువుకునే పేదింటి బిడ్డల భవితకు భరోసా ఇస్తున్నాయి.రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 50 ఆశ్రమ పాఠశాలల్లో ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో ఈ–-స్కూల్స్‌‌ నిర్వహిస్తున్నారు. 
స్కూళ్లలో ఔట్ ఆఫ్ ది టెక్స్ట్  బుక్స్

హైదరాబాద్‌‌లోని సంక్షేమ భవన్‌‌లో ఈ–-స్కూల్స్టూడియో ద్వారా సబ్జెక్ట్‌‌ ఎక్స్‌‌పర్ట్స్‌‌తో రోజూ ఇంగ్లిష్‌‌, మ్యాథమెటిక్స్‌‌, సైన్స్‌‌, సోషల్‌‌ స్టడీస్‌‌లో క్లాస్‌‌లు చెప్పిస్తున్నారు. స్టూడెంట్లకు ఈజీగా అర్థమయ్యేలా లెసన్స్కు సంబంధించిన స్లైడ్స్‌‌, విజువల్స్‌‌ ప్రదర్శిస్తున్నారు. ఈ–-స్కూల్స్‌‌ స్టార్ట్‌‌ అయ్యాక స్టూడెంట్లలో సృజనాత్మకత పెరిగిందని, క్లాస్‌‌లో చెప్పే పాఠాలకన్నా ఈ–-లెసన్స్‌‌ సులువుగా అర్థమవుతున్నాయని అంటున్నారని ఆయా స్కూళ్ల టీచర్లు చెప్తున్నారు. రోజూ ఒక్కో తరగతికి ఈ‌‌‌‌ లెసన్స్ చెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు.యాన్యువల్‌‌ ఎగ్జామ్స్‌‌ టైంలో స్టూడెంట్లలో భయం ఎక్కువగా కనిస్తుంది. చదివిన విషయాలు మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి వాటిని నుంచి వారు బయటపడేలా, పరీక్షల భయం పోగెట్టేలా డాక్టర్లు, మోటివేషనల్ స్పీకర్లు, ఇతర ఎక్స్‌‌పర్ట్స్‌‌తో మోటివేషన్‌‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్న విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వాటిని అందుకోవడానికి ఏయే కోర్సులు చదువుకునే సదుపాయాలు ఉన్నాయి, ఇతర అంశాలనూ ఎక్స్‌‌పర్ట్స్‌‌తో చెప్పిస్తున్నారు. గతేడాది స్టూడెంట్స్‌‌ను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ప్రధాని మోడీ నిర్వహించిన ‘‘పరీక్ష పే చర్చ’’ను ఈ-స్కూల్స్‌‌ లో టెలికాస్ట్‌‌ చేశారు.ఇస్రో పరిశోధనలు, ఇతర కీలక ప్రయోగాల సందర్భాల్లో ఆయా రంగాల ఎక్స్‌‌పర్ట్‌‌ల ద్వారా స్టూడెంట్లకు క్లాసులు చెప్పిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇతర ముఖ్య పరిశోధనలపైనా ఇలాంటి అవగాహన కల్పిస్తున్నారు. చదువుకే పరిమితం కాకుండా స్టూడెంట్లలో ఆలోచనా శక్తిని పెంచే సినిమాలను జాతీయ దినాల్లో ప్రదర్శిస్తున్నారు. చిల్డ్రన్స్‌‌ డే సందర్భంగా 35 దేశాలకు సంబంధించిన 40 షార్ట్ ఫిలిమ్స్‌‌ చూపించారు. కప్‌‌ ఆఫ్‌‌ టీ, త్రీ ఫీట్‌‌, స్టోరీ ఆఫ్‌‌ ఏ స్కూల్‌‌ బాయ్‌‌, లా రెవె దె సామ్‌‌ అండ్‌‌ సో ఆన్‌‌ వీటిలో ముఖ్యమైనవి. ఓపిక, శ్రమ, సంకల్పం, మంచితనం తదితర కాన్సెప్ట్లతో ఉన్న ఈ షార్ట్‌‌ ఫిలిమ్స్‌‌తో స్టూడెంట్స్లో ఉత్తేజం నింపాయి. ఎక్స్‌‌పర్ట్స్‌‌ లెసన్స్‌‌, షార్ట్‌‌ ఫిలిమ్స్‌‌తో మారుమూల ప్రాంతాల స్టూడెంట్లలో అవగాహనా స్థాయి పెరుగుతుందని ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ-లెర్నింగ్‌‌ స్కూల్స్‌‌ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు