అమరావతి నవంబర్ 14 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సినీయర్ ఐయేఎస్ అధికారిణి నీలం సహనీ గురువారం బాధ్యతలు చేపట్టారు. అమరావతిలో ఆమె ఇన్చార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నుండి బాధ్యతలు తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వానికి తొలి మహిళా సీ యస్ గా బాధ్యతలు తీసుకోవడం పై హర్షం వ్యక్తం చేస్తున్న నీలం సహాని కి పలువురు ఐఏఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు అభినందనలు తెలియజేసారు.
ఏపీ తొలి మహిళా సీఎస్ గా నీలం సాహ్ని బాధ్యతల స్వీకరణ
1984 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నీలం సహాని ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా సహాని బాధ్యతలు నిర్వహించారు. నల్గొండ జిల్లా కలెక్టర్గా సహాని బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సర్వీసులకు వెళ్లి గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఏపీఐడీసీ వీసీఅండ్ఎండీ, స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నీలం సహాని పని చేశారు. 2018 నుంచి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా సహాని పని చేసారు.