కలెక్టర్ శ్వేతా మహంతి
వనపర్తి నవంబర్ 18 (way2newstv.com)
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 70 మంది ఫిర్యాదుదారులు విచ్చేసి వారి ఫిర్యాదు కలెక్టర్కు అందజేశారు.
ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించండి
ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా ఫిర్యాది దారులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి ఫిర్యాదుదారు లకు న్యాయం చేకూర్చాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.