న్యూఢిల్లీ, నవంబర్ 1, (way2newstv.com)
ర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీలో వాయు కాలుష్యం అతి తీవ్ర స్థాయిలో ఉందని పేర్కొన్నది. ప్రస్తుతం ఆ స్థాయి అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిందని ఆ సంస్థ తెలిపింది. దీంతో ఢిల్లీ నగరంలో నిర్మాణ కార్యక్రమాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 5వ తేదీ వరకు నిర్మాణాలను నిలిపివేయాలన్నది. శీతాకాల సీజన్ మొత్తం బాణాసంచా పేల్చ వద్ద అని కాలుష్య సంస్థ ఆదేశించింది.
ఢిల్లీలో హెల్త్ ఎమెర్జెన్సీ
వాయు కాలుష్యం విషపూరితం కావడం వల్ల పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించింది. పిల్లలపై వాయు కాలుష్య ప్రభావం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. వాయు కాలుష్య సమస్యపై ఢిల్లీ పరిసర రాష్ట్రాలన్నీ సమస్య గురించి సానుకూలంగా చర్చించాలని కేంద్ర మంత్రి జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఓ గ్యాస్ చాంబర్‌లా తయారైందని సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు.