బిన్‌ లాడెన్‌, జవహిరీ, జలాలుద్దీన్‌ పాకిస్థాన్‌ హీరోలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిన్‌ లాడెన్‌, జవహిరీ, జలాలుద్దీన్‌ పాకిస్థాన్‌ హీరోలు

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు  ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్‌ నవంబర్ 14  (way2newstv.com)
పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన ఓ వీడియో క్లిఫ్‌ బయటపడింది. ఒసామా బిన్‌ లాడెన్‌, జవహిరీ, జలాలుద్దీన్‌ హక్కానీ పాకిస్థాన్‌ హీరోలు అని ముషారఫ్‌ పేర్కొన్నారు. అంతే కాదు కశ్మీరీలకు పాకిస్థాన్‌లో శిక్షణ ఇచ్చి ఉగ్రవాదం వైపు మళ్లించామని ఆ ఇంటర్వ్యూలో ముషారఫ్‌ చెప్పారు. అయితే ఆ వీడియో క్లిఫ్‌ను పాకిస్థాన్‌ రాజకీయ నాయకులు ఫర్హాతుల్లా బాబర్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియదు.
బిన్‌ లాడెన్‌, జవహిరీ, జలాలుద్దీన్‌ పాకిస్థాన్‌ హీరోలు

ముషారఫ్‌ వ్యాఖ్యల సారాంశం.. కశ్మీరీలు పాకిస్థాన్‌ వచ్చేవారు. వారికి ఉగ్రవాదంలో శిక్షణ ఇచ్చి మద్దతు తెలిపాం. వారిని ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులుగా మార్చి ఇండియన్‌ ఆర్మీపై ఫైట్‌ చేయాలని చెప్పాం. ఆ తర్వాత లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉగ్రవాదులంతా తమ హీరోలు. ఒసామా బిన్‌ లాడెన్‌, జవహిరీ, జలాలుద్దీన్‌ హక్కానీ పాకిస్థాన్‌ హీరోలు అని ముషారఫ్‌ పేర్కొన్నారు.1979 కాలంలో పాకిస్థాన్‌ ప్రయోజనాల కోసం ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి.. ప్రపంచం నలు మూలల నుంచి ముజాహిద్దీన్‌లను తీసుకువచ్చాం. వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలను కూడా సరఫరా చేశామన్నారు ముషారఫ్‌. తర్వాత వారిని వారి సొంత ప్రాంతాలకు పంపించి ప్రపంచ వాతావరణాన్ని మార్చేశామని ముషారఫ్‌ చెప్పారు.