హైద్రాబాద్, నవంబర్ 30,(weay2newstv.com)
ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరుగను న్న ఈ సమావేశానికి రాష్ట్రంలోని 97 బస్ డిపోలకు చెందిన కార్మికులు.. ఒక్కో డిపో నుంచి ఐదుగురు చొప్పున హాజరుకావాలని అహ్వానించారు. ఆహ్వానితులు ప్రగతిభవన్‌కు వచ్చేందుకు తగిన రవాణా సౌకర్యం ఏర్పాటుచేయాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి డిపో నుంచి సమావేశానికి ఆహ్వానించే ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా కార్మికులు ఉండాలన్నారుఈ సమావేశంలో అన్నివర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం స్పష్టంచేశారు.
ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ లంచ్ మీటింగ్
ప్రగతిభవన్‌కు వచ్చే ఆర్టీసీ కార్మికులకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భోజనం అనంతరం కార్మికులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో టీఎస్ ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్‌ఎంలు, డివిజనల్ మేనేజర్లను కూడా ఆహ్వానించారు.ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి షరతులు పెట్టకుం డా విధుల్లో చేర్చుకోవడానికి అనుమతించిన సీఎం కేసీఆర్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మంత్రి కలిశారు. ఆర్టీసీని కాపాడటానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చినందుకు, కార్మికులతో నేరుగా చర్చలు జరుపాలని నిర్ణయించుకొన్నందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.