శ్రీవాణి ట్రస్టుకు అపూర్వ స్పందన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రీవాణి ట్రస్టుకు అపూర్వ స్పందన

తిరుమల, నవంబర్ 2, (way2newstv.com)
'ఇక శ్రీవారు భలే ప్రియం' కానున్నారు.. 'గోవిందుడు' అందరివాడు కాస్తా కొందరివాడే అయ్యేలా అధికారుల నిర్ణయాలున్నాయి.. శ్రీవెంకటేశ్వర ఆలయ నిర్మాణాల ట్రస్టు (శ్రీవాణి) పేరుతో కొత్త పథకానికి టిటిడి శ్రీకారం చుట్టింది. దీనివల్ల హుండీకి వచ్చే ఆదాయం భారీగా గండి పడే ప్రమాదం ఉందని ఉద్యోగులు అంటున్నారు. అంతేకాదు, టిటిడిలో అన్నదానం, ప్రాణదానం వంటివి సామాజిక సేవా ప్రాజెక్టులకు విరాళాలు గణనీయంగా తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. 500 రూపాయల విఐపి బ్రేక్‌ టికెట్లకు స్వస్థి పలికి శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు ఇస్తే చాలు. విఐపి బ్రేక్‌ దర్శనంతో పాటు హారతి కల్పిస్తామని చెప్పడంతో మధ్యతరగతి ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. 
శ్రీవాణి ట్రస్టుకు అపూర్వ స్పందన

ఈ నిర్ణయంపై మధ్యతరగతి, టిటిడి ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించేందుకు శ్రీవాణి ట్రస్టును తీసుకొస్తున్నట్లు స్పెషలాఫీసర్‌ ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు. విఐపి దర్శనం టికెట్‌ను పదివేల రూపాయలకు అమ్మి, ఆ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించాలన్నది ప్రాజ ెక్టు ఉద్దేశం. రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో టిటిడి ఆర్థిక సహకారంతో ఇప్ప టికే వెంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు జరుగు తున్నాయి. గతంలో ఒక కుటుంబంలో నలుగురు విఐపి దర్శనానికి వెళితే 2వేల రూపాయలతో సరి పోతుంది. ప్రస్తుతం విఐపి బ్రేక్‌ను శ్రీవాణి ట్రస్టుకు అనుసంధానం చేయడంతో నలుగురికి రూ.40 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక కుటు ంబంపై 38వేల పైనే భారం పడనుంది. ఇలా అద నపు డబ్బులను ట్రస్టుకు ఇవ్వడం ద్వారా హుండీలో వేసే ఆదాయం తగ్గుతుందని విశ్లేషకుల అంచనా.టిటిడిలో ఎప్పటినుంచో అమల్లో ఉన్న అన్నప్రసాదం, ఆరోగ్య వరప్రసాదిని, గోసంరక్షణ, ప్రాణదానం, విద్యాదానం, వేద పరిరక్షణ వంటి ట్రస్టుకు భక్తులు సమర్పించే విరాళాలు 'శ్రీవాణి' రాకతో గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. టిటిడి వార్షిక ఆదాయం 3,500 కోట్లు కాగా, అందులో 1200కోట్లపైనే ఆదాయం హుండీ ద్వారానే వస్తుంది. 'శ్రీవాణి' ట్రస్టు వల్ల హుండీ ఆదాయం తగ్గి శ్రీవారి డిపాజిట్లపై ప్రభావం పడనుంది