అనుమతులు ఉన్నాయి... భయం లేదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనుమతులు ఉన్నాయి... భయం లేదు

హైద్రాబాద్, నవంబర్ 2  (way2newstv.com)
లాంగ్ మార్చ్ పేరుతో విశాఖలో ఆదివారం భారీ ఆందోళన కార్యక్రమానికి సిద్ధమైంది జనసేన. విశాఖలో మార్చ్‌కు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో లాంగ్ మార్చ్‌కు అనుమతి లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పోలీసులు అనుమతి నిరాకరించారని.. ఆందోళన కార్యక్రమం జరగడం అనుమానమే అంటూ కొన్ని పోస్ట్‌లు వైరల్ అయ్యాయి.లాంగ్ మార్చ్‌పై జరుగుతున్న ప్రచారంపై జనసేనాని ట్విట్టర్‌లో స్పందించారు. పోలీసులు ఈ ఆందోళనా కార్యక్రమానికి అనుమతి ఇచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు. అనుమతికి సంబంధించిన డాక్యుమెంట్‌ను కూడా ట్వీట్ చేశారు. 
అనుమతులు ఉన్నాయి...  భయం లేదు

జనసైనికులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. అదంతా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆరోపించారు.పవన్ తన ట్వీట్‌లో ‘భవన నిర్మాణ కార్మికుల ఆవేదనను వినిపించేందుకు.. విశాఖలో ఆదివారం జరిగే లాంగ్ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది.. జనసైనికులు, పార్టీ నేతలు నమ్మొద్దు’అంటూ పవన్ కళ్యాణ్ కోరారు.ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు రామకృష్ణ, మధు లేఖ రాశారు. విశాఖలో జరిగే లాంగ్‌ మార్చ్‌కు తమ సంఘీభావం తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ సహకారం తీసుకోవాలనుకోవడంపై అభ్యంతరం తెలిపారు. పవన్ చేపట్టే కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నామని చెప్పారు.