విజయవాడ, నవంబర్ 12, (way2newstv.com)
మరో మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు కోర్టుకు వైసీపీ సర్కార్ తెలియచేసింది. దీని మీద మంత్రి బొత్స సత్యనారాయణ కూడా క్లారిటీ ఇచ్చేశారు.ఏపీలో ఇప్పటికి చూసుకుంటే వైసీపీ విజయాన్ని ఇంకా టీడీపీ జనసేన వంటి పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అదే సమయంలో ఓటమి తరువాత యాక్షన్ ప్లాన్ కూడా ఇంకా సిద్ధమైనట్లుగా ఏమీ లేదు. ఓ వైపు టీడీపీ, జనసేన నుంచి అధికార వైసీపీ, బీజేపీలలోకి జంపింగులు సాఫీగా సాగిపోతున్నాయి. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ, ఒకే ఒక్కడిగా జనసేన ఇపుడు ఏపీ రాజకీయ క్షేత్రంలో నిలిచి ఉన్నాయి. ఈ రెండు పార్టీలను లాంగ్ మార్చ్ తాజాగా కలిపింది.
లోకల్ ఎలక్షన్స్ కు రెడీ అవుతున్నారు...
అయితే వీరిది ఎన్నికల ముందు నుంచి ఉన్న బంధమని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు కూడా. మరో వైపు ఏపీలో బీజేపీ బలం పెరిగిందని కాషాయధారులు భావిస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాల తీరు చూస్తే అలాగే ఉన్నాయి. మొత్తం మీద ఇపుడున్న రాజకీయ పరిస్థితి ఇది. ఈ నేపధ్యంలో స్థానిక ఎన్నికలు వస్తే కనుక విజయం ఎవరిది అన్న చర్చ గట్టిగానే సాగుతోంది.సార్వత్రిక ఎన్నికలు అయి ఆరు నెలలు మాత్రమే అయింది. ఇక వెంటనే ఎన్నికలు అంటే ఓ విధంగా ప్రతిపక్షాలకు సవాల్ గానే చూడాలి. పైగా స్థానిక ఎన్నికలు అంటే అవి కచ్చితంగా అధికార పార్టీకే ఉపయోగపడతాయి. ప్రజలు కూడా ఏ ఎన్నికకు ఎవరికి ఓటు చేయాలి అన్న లోకల్ ఎలక్షన్స్ కు రెడీ అవుతున్నారు...దాని మీద బాగానే తెలివి మీరారు. ఎటూ ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకే ఓటు చేస్తేనే తాము అభివృధ్ధిలో భాగమవుతామన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది. ఇది ఇప్పటికి అనేకసార్లు రుజువు అయింది. ఇక ఈ ఎన్నికల్లో విపక్షాలకు సీట్లు కొన్ని దక్కినా వారు ఫిరాయించకుండా ఉంటారన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. లాంగ్ మార్చ్ ద్వారా పవన్ జనంలో ఉన్నాడనిపించుకున్నా జనసేన మొత్తం రాజకీయానికి అది కనీస ఇంధనం కూడా కాదు, ఇక బాబు దీక్షలు, ఆందోళనల పేరిట హడావుడి చేస్తున్నా అవి పార్టీని ఎంతవరకు ఒడ్డున పడేస్తాయన్నది తేలని వ్యవహారమే.మరో వైపు చూసుకుంటే ఇసుక కొరత సమస్య వల్ల లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారని ఇక నిర్మాణ రంగం కుదేలు కావడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ప్రభావం పడుతుందని , అది ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తుందని టీడీపీ, జనసేన అంచనా వేస్తున్నాయి. అయితే మరో వైపు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రకటిస్తూ ఈ వ్యతిరేకతను బ్యాలన్స్ చేస్తోందన్న వాదన కూడా ఉంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు జరిగే సమయానికి ఇసుక కొరత అన్న సమస్య ఉండదని కూడా వైసీపీ నమ్ముతోంది. మరో వైపు ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలు గెలవాలనే జగన్ ఇతర పార్టీల నుంచి నేతలకు గేలం వేస్తున్నారు. పైగా అధికారం చేతుల్లో ఉంది. మొత్తానికి చూసుకుంటే స్థానిక ఎన్నికలు అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షానికి కూడా సవాలే. మరో వైపు ఏపీలో కాలు మోపుతామంటున్న బీజేపీ కధను కూడా ఈ ఎన్నికలు తేల్చేస్తాయని అంటున్నారు.