మద్యం అమ్మకాల్లో డౌన్ ట్రెండ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మద్యం అమ్మకాల్లో డౌన్ ట్రెండ్

గుంటూరు, నవంబర్ 7, (way2newstv.com)
రాష్ట్రంలో మద్యపానంతోపాటు విక్రయాలూ క్రమేణ దిగి వస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాదిలో గణనీయంగా విక్రయాల తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న కారణంగా నిర్ణీత సమయానికే వాటిని మూసివేస్తున్నారు. ఫలితంగా విక్రయాలు క్రమేణా తగ్గుతున్నట్లు అబ్కారీ శాఖ స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ గణాంకాల ప్రకారం గత ఏడాది అక్టోబర్‌లో 32,28,366 కేసుల మద్యాన్ని వియ్రించగా, ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో 23,60,089 కేసులు మాత్రమే అమ్ముడయ్యాయిఅటు బీరు విక్రయాలూ గణనీయంగా తగ్గాయి. 
మద్యం అమ్మకాల్లో  డౌన్ ట్రెండ్

గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్ల అమ్మకాలు జరిగాయని ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 3,500 మాత్రమే. ఈ కారణంగా క్రమేణా విక్రయాలు తగ్గుతున్నాయని, మద్య నియంత్రణ కార్యక్రమం సఫలీకృతమవుతోందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అటు గ్రామ వలంటీర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించకుండా నిఘా పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాలతో క్రమంగా మద్యపాన నియంత్రణ దిశగా ఏపీ అడుగులేస్తోందని ప్రభుత్వం భావిస్తోంది.