పల్లాకు పక్కా ప్రొమోషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పల్లాకు పక్కా ప్రొమోషన్

హైద్రాబాద్, నవంబర్ 2, (way2newstv.com)
టిఆర్ఎస్ పార్టీలో ఆయన ఓ కీలకనేత. తెలంగాణ ముఖ్యమంత్రికి కొడుకు కేటీఆర్ ఎంతో…..మరోవైపు ఈయన కూడా అంతే. కేసీఆర్ ఏది చెబితే అది తూచా తప్పకుండా ఆచరిస్తారు. కేసీఆర్ దిశను చెబితే ఈ నేత  దాని దశ మారుస్తారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విక్టరీ సాధించడంతో సదరు నేతకు ప్రమోషన్ గ్యారెంటీ అంటున్నారు…మరి ఆయనకుడెవరో తెలుసా పల్లా రాజేశ్వర్ రెడ్డి.శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ గా కొనసాగుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి సీఎం కేసీఆర్‌ కు దగ్గరి వాడయ్యాడు. పార్టీ చేపట్టే ఏ కార్యక్రమమైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి పైనే సీఎం కేసీఆర్ కీలక బాధ్యతలు పెడుతున్నారు. ఆ బాధ్యతలను కూడా పల్లా సక్రమంగా పూర్తి చేస్తున్నారు. వ్యాపారి అయిన పల్లా ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలకు అధిపతి. తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
పల్లాకు పక్కా ప్రొమోషన్

టీఆర్ఎస్ లో క్రమంగా అధినేత కేసీఆర్ మెప్పు పొందుతూ వస్తున్నారు. గతంలో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. పార్టీలో కీలకంగా పనిచేస్తూ వచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.19 ఏళ్ల క్రితం కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి అధినేత వెంట అనేక మంది నేతలు ఉన్నారు. వారందరికీ ప్రాధాన్యత ఉన్నా పల్లా రాజేశ్వర్ రెడ్డికి మాత్రం వారి కంటే ఎక్కువ ప్రాధాన్యతే లభిస్తోంది. అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా చేస్తుండడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్ల కేసీఆర్ కు నమ్మకం ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ కార్యవర్గ సమావేశాల దగ్గర నుంచి టీఆర్ఎస్ మార్క్ భారీ బహిరంగ సభల నిర్వహణ వరకు పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కీలకబాధ్యతలు పెడుతోంది పార్టీ. ఈ బాధ్యతలను నెరవేర్చడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శికూడా.హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఆ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు. ఆయన కూడా అంతే వినయవిధేయతతో హుజూర్ నగర్లోనే మకాం వేసి రాజకీయ చతురతతో పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించారు. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ తనపై పెట్టిన బాధ్యతలను పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. సాధారణ ఎన్నికల కు ముందు  టిఆర్ఎస్ ఇబ్రహీంపట్నం శివారులో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభ నిర్వహణలోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అక్కడి ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకున్నారు.ఇలా పార్టీ పనులు ఏవున్నా తన భుజాల మీద వేసుకుని పల్లారాజేశ్వర్ రెడ్డి వాటిల్లో విజయం సాధిస్తున్నారు. ఇలా కేసీఆర్ కు పెద్దకొడుకులా మారాడు. ఓ వైపు కేటీఆర్, మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డిలు పార్టీని కేసీఆర్ రెండు భుజాల్లా తీసుకువెళ్తున్నారు. ఎక్కడా ఎదురులేకుండా చాణిక్యత ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమోషన్ గ్యారెంటీ అని పార్టీ శ్రేణుల్లో చర్చజరుగుతోంది. అప్పగించిన పనులుచేసుకుంటూ ముందుకు సాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నడూ తనకు ఇది కావాలని అధినేత కేసీఆర్ ను అడగకపోవడం కూడా పల్లాకు ప్లస్ అవుతోంది. దీంతో అధినేత సైతం పల్లాకు సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం వినిపిస్తోంది. త్వరలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమోషన్ గ్యారంటీ అని గులాబీ పార్టీలో గట్టిగానే విన్పిస్తుంది.