సిద్ధిపేట నవంబర్ 18, (way2newstv.com)
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమురవేల్లి మల్లిఖార్జున స్వామి దేవాలయం లో మహా కుంభ అభి షేకం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాలయం లో ఆలయ రాజ గోపురానికి పన్నెండు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మహా కుంభ అభిషేకం నిర్వహిస్తున్నారు. సోమవారం నుండి ఐదు రోజులపాటు మహ కుంభ అభిషేకాలు ,పూజ కార్యక్రమాలు జరగనున్నాయి.
కొమురవెల్లిలో అభిషేకం ఉత్సవాలు
ఈ కార్యక్రమానికి వీర శైవ జగద్గురువు పీఠాధిపతి ఉజ్జాయిని సద్ధర్మ సింహ్మసానదీశ్వర సిద్ధలింగం రాజాదేశి కేంద్ర శివాచార్య స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం లో మల్లిఖార్జున స్వామి వారికి నిత్యర్పణ, మంగలవాయిద్యాపూర్వక ఆగ్రోదం,గోపూజ,మహా గణపతి పూజ ,వైదిక స్వస్తి పున్యాహక వారనం, రక్ష బంధాన్,మృత్ సంగ్రహణం, మహా హారతి పూజ కార్యకమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డేవాల అర్చకులు, ఒగ్గుపూజారులు, భక్తులు పాల్గొన్నారు