మహబూబాబాద్ నవంబర్ 21 (way2newstv.com):
: రైతు సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఉందని ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చెయ్యాలని కేసీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తొర్రూరు మండలం మాటడులో గురువారం ఆయన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు: మంత్రి ఎర్రబెల్లి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ఇస్తున్నారు. పెట్టుబడి కోసం ప్రతి ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏటా రూ.13 వేల కోట్లు కేటాయిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతులు మరణిస్తే రైతు బీమాతో ఆసరాగా ఉంటున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోoది. వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.