ఆరు లీటర్ల నాటుసారా స్వాధీనం
వనపర్తి నవంబర్ 21 (way2newstv.com)
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం లోని తండాలలో ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 160 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు. ఆరు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై వెంకట్ రాములు తెలిపారు.
బెల్లం పానకం ధ్వంసం....
గోపాల్ పేట మండలం లోని పోలికే పాడు కర్ణమయ్య కుంట తండాలో మరియు గోపాల్పేట తాండలో బుధవారం మధ్యాహ్నం మెరుపు దాడులు నిర్వహించి ఇంట్లో నిల్వ ఉన్న 160 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని, డేగ వత్ జమ్ములమ్మ దగ్గర రెండు లీటర్ల నాటుసారా, డేగ వత్ హనుమంతు దగ్గర నాలుగు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై వెంకట్ రాములు, హెడ్ కానిస్టేబుల్ భగవంత గౌడ్, కానిస్టేబుల్ లక్ష్మి, జనార్ధన్ రెడ్డి, ఏలియా, దస్తగిరి పాల్గొన్నారు