పోలీసు రోబోలు వచ్చాయి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పోలీసు రోబోలు వచ్చాయి

విశాఖపట్నం నవంబర్ 20  (way2newstv.com)
హైటెక్నాలజీ పరుగులు పెడుతున్న నేటి ఆదునియ యుగంలో పోలీస్ శాఖ అప్ గ్రెడ్ అవుతోంది.క్రైం రేట్ ను అదిగమించేందుకు రోబోలను ప్రవేశపెట్టి మంచి ఫలితాలను సాదించేలా విశాఖ కేంధ్రంగా ఖాఖీలు రోబోలతో సేవలు వినియోగించే ప్రయోగాత్మకానికి శ్రీకారం చేట్టారు.  ఇప్పుడు రోబోలు మరో ముందడుగు వేసి పోలీస్ స్టేషన్ లో ను తమ ప్రస్థానాన్ని ప్రారంభించడానికి సిద్ధమైయ్యాయి.ఇకపై రోబొలు పోలిస్ ష్టేషన్లో  కుడా దర్శనం ఇవ్వనున్నాయి.స్మార్ట్ సిటి విశాఖలో క్రైం రేట్ తగించడమే ప్రధాన లక్ష్యంతో పోలీసు శాఖ ప్రయోగాత్మకంగా రోబో సేవల వినియోగంపై దృష్టి సారించింది.దింతో వీటిని ఉపయోగించేలా అధికారులు చర్యలు చేపట్టారు.
పోలీసు రోబోలు వచ్చాయి

విశాఖ పోలీస్ శాఖ పరిపాలనలో రోబోలు కీలకం కానున్నాయి.కంప్లైంట్ నమోదు చెయ్యటం వాటిని సంబంధించిన పోలీస్ స్టేషన్ చేరవేయ్యటంలో రోబోలు స్థానాన్ని దక్కించు కున్నాయి.పోలిసులకు భారంగా మారుతున్న కంప్లైంట్ స్వీకరించేలా .. పోలిసులు విన్నూత్న ఆలోచనలో బాగంగా పుట్టుకొచ్చిన చిట్టీ రోబోలు ... స్టేషన్ లో దర్శనమివ్వడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఈ రోబో సేవలను నగర సీపీ ఆర్కేమీనాకు రోబో నిర్వాహకులు వివరించారు.రొబో కపులర్ అనే స్టార్టప్ సంస్ద పోలిసులు సంయుక్తంగా ఈ సేవలను విశాఖ మహారాణి పేట పోలిస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించారు.దీని వల్ల సిబ్బంది పై ఒత్తిడి భారం తగ్గుతుందని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.ఈ రోబో పోలిస్ పేరు సైబిరా పేరుతో సేవలను ప్రవేశపెట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.