గంజాయి రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గంజాయి రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం

భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 04  (way2newstv.com)
గత పది రోజులుగా జిల్లా పోలీసులు గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసి సుమారుగా రూ 92,00,000 విలువ గల గంజాయిని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.10 రోజుల్లో మొత్తం నాలుగు కేసుల్లో భారీమొత్తంలో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.బూర్గంపాడు పోలీసులు పట్టుకున్న ముగ్గురు వ్యక్తుల వద్ద నుండి రూ 8,25,000 విలువ గల గంజాయిని, భద్రాచలం పోలీస్ స్టేషన్లో నమోదయిన 02కేసుల్లో సుమారుగా రూ 76,00,000  విలువ గల గంజాయిని, నిన్న పాల్వంచ పోలీస్ స్టేషన్ పట్టుబడిన వ్యక్తి వద్ద నుండి రూ 8,10,000 విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి రవాణాపై జిల్లా పోలీసుల ఉక్కుపాదం

మొత్తం 08 మంది వ్యక్తుల వద్ద నుండి సుమారుగా రూ 92,00,000 విలువైన గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై ఎన్డీపీఎస్  యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. గంజాయి రవాణాను అదుపు చేయడంలో జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పనితీరును ఎస్పి సునీల్ దత్ అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన సీలేరు,ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి ఎక్కువగా వస్తోందని అన్నారు.