జగన్ కు ముద్రగడ లేఖ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ కు ముద్రగడ లేఖ

 కాకినాడ, నవంబర్ 4, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఇసుక కొరతపై ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇసుక కొరతకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రికి ఓ సలహా కూడా ఇచ్చారు. ఎన్నో పథకాలను తీసుకొస్తున్న జగన్.. కాపుల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రశ్నించారు. అంతేకాదు జగన్ పరిపాలన చూస్తుంటే.. అభద్రతా భావంలో ఉన్నారని తెలియజేస్తోందన్నారు.ముద్రగడ తన లేఖలో.. ‘మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్న సంగతి లోకానికి తెలుసు, ఈ వరాలే కాకుండా ఎన్నో కొత్త కొత్తవి ప్రకటించడం వాటి పంపిణీకి తేదీల వారీగా క్యాలండరు (ప్రకటించడం చేస్తున్నారు.
జగన్ కు ముద్రగడ లేఖ

నిధులు కోసం భూములు అమ్మకం వార్తలు రావడం కూడా చూస్తున్నాను. దీన్ని బట్టీ ఆలోచిస్తోంటే మీలో అభద్రతా భానం పెరిగి కంగారు పడుతున్నట్టుగా అనిపిస్తోంది’.‘హామీలు ఇవ్వని కొత్త పథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం చాలా తాహతయ పడుతున్నారు. అలా తాపత్రయ పడే వాటిలో మాజాతి “బి.సి-ఎఫ్‌ రిజర్వేషన్‌” అంశం లేకపోవడం మాజాతి చేసుకున్న పాపం అనుకుంటున్నాను. ఇది రాయవలసిన సందర్భం కాదు కొని రాష్ట్రంలో ఇసుక గురించి (ప్రజలు పదుతున్న బాధలు వర్ణనాతీతం. అటువంటి బాధలు మాజాతి రిజర్వేషన్‌ కోసం అనుభవిస్తున్నందుకు రాయవలసి వచ్చింది’.‘ఎన్నో సంక్షేమ పధకాలు రూపకల్పన చేయడంలో చాలా చొరవ తీసుకుంటున్నారు. కాని ఎందుచేతో ఇసుక పాలసీ విషయంలో నిర్లక్ష్యం వహించడం భావ్యం కాదని మేధావులలోను, ప్రజలలోను అనిపిస్తోంది. నదులలో నిత్యం నీరు ఉందే రోజులు, లేని రోజులు ప్రజలకు కెలుసు, కాని నీరు ఉండటం వల్ల ఇసుక కొరత అన్నది ప్రభుత్వ పక్షాన చెప్పడం చాలా తప్పు. ఈ ఇసుక ప్రజలకు ప్రశ్ళత ఇచ్చిన వరం ప్రభుత్వానికి ఎటువంటి పెట్టుబడి లేనిది. ప్రజలు సుఖంగా జీవించే లాగ చర్యలు ఉండాలి తప్ప, ఓట్లు వేసిన వారిని బాధించడం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకురావడం మంచిది కాదని నా అభిప్రాయం’.నేను పెద్దగా చదువుకోలేదు, మేధావిని అంతకంటే కాదు, ఇసుక గురించి ప్రజలు పడుతున్న బాధలు చూసి ఈ లేఖ రాస్తున్నాను. ఉదాహరణకు 4 లైన్లు రోడ్లు ఎప్పుడైనా ఒక వైపు ఆటంకం వస్తే, ఆటంకం తొలగే వరకు ట్రాఫిక్‌ అపకుండా రెండోవైపు (ఒకవైపు వెళ్ళేదారిని) రెండు వైపులా వాడుకుంటారు. అలా వాడుకున్నంత మాత్రాన ప్రభుత్వం తప్పు చేసినట్లు కాదండి. అలాగే మీ ఇసుక పాలసీ పగడ్భంధీగా అమలు చేయడానికి కావలసినంత సమయం తీసుకోండీ. అది అమలు అయ్యేలోపు ప్రకృతి ఇచ్చిన ఇనుకను ప్రజలకు, రెవిమ్యా, మైన్స్‌, పోలీసు మొదలగు శాఖలు అనుమతి అవసరం లేకుండా ఎవరికి ఎంత కావాలో అంత ఇసుకఉచితంగా తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం వలన ప్రజలు సుఖపడతారని నేను అభిప్రాయపడుతున్నాను’.దయచేసి నేను రాసిన విషయాలు పరిశీలించండి. ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడిలేదు. ప్రజలను,కార్యాలయాలు, ఇ-సేవలు చుట్టూ తిరిగే పరిస్థితి తేకుండా పక్కా పాలసీ తయారయ్యే వరకూ ఉచిత ఇసుక ఆదేశాలు ఇవ్వడం మంచిదనిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రం నుండి ఇసుక ప్రక్క రాష్ట్రాలకు తరలిపోకుండా గట్టి బందోబస్తు చేయడానికి తగు చర్యలు కూడా తీసుకోమని కోరుతున్నాను’అన్నారు