చిరుధాన్యాలు మన ఆహారంలో భాగం కావాలి
గర్భిణీ స్త్రీలు చిరుధాన్యాలు తప్పక తీసుకోవాలి
చిరుధాన్యాల ఉత్పత్తి ఇంకా పెరగాలి.
ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ నవంబర్ 30 (way2newstv.com)
చిరు ధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్ ఇన్సిస్యిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్ ఆ ధ్వర్యంలో హెచ్ఐసీసీలో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు, చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. తరువాత అయన పల్స్ బాస్కెట్ ను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు పెరిగేందుకు అన్నిరకాలుగా మద్ధతు ఇస్తుంది. యోగా, ప్రాణయామ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, రసాయనాలు వాడని ఆహారపు పంటలు వంటి వాటిపై ప్రజలు దృష్టి సారించారని అన్నారు. పూర్వపు పరిస్థితులపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.
చిరు ధాన్యాలతోనే చక్కటి ఆరోగ్యం.
నేటి ఆధునిక యుగంలో వాటి ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. పూర్వకాలంలో వందేళ్లు బతికిన వారు నేటి తరంలో 60, 70 ఏళ్ల కూడా బతకడం లేదు. నలభై, యాభై ఏళ్లకే సుగర్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. అందుకు కారణం. ఆహారపు అలవాట్లు, జీవన శైలే ప్రధాన కారణమని అన్నారు. ప్రభుత్వం దీనిని గుర్తించే పాఠశాలల్లో యోగా, ప్రాణయామలను తప్పనిసరి చేశాం. ఇక ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంది. గర్భిణీ సమయంలో స్త్రీలకు చిరుధాన్యాలు ఇవ్వడం వల్ల రక్తహీనత సమస్య ఉండదు. ప్రసవం అనంతరం తల్లి, బిడ్డ సురక్షితంగా ఉంటారు. మా ప్రభుత్వం ప్రోటీన్ గల ఆహరం హస్టల్ విద్యార్థులకు అందిస్తోంది. ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే, ప్రజల ఆహార అలవాట్లు బాగుండాలి. సేంద్రీయ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆహారంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరమని అన్నారు. మెట్రో సిటీల్లో ప్రారంభమయిన చిరుధాన్యాల ఆహారపు అలవాట్లు ఇతర పట్టణాల్లోను ప్రారంభమయింది. ఇలాంటి మిల్లెట్ స్టార్టప్స్ తప్పకుండా విజయవంతం అవుతాయి. ప్రజలు చిరుధాన్యాల ఆహార ప్రాముఖ్యతను గుర్తించారు. ఆర్గానిక్ వ్యవసాయం కూడా పెరగాల్సి ఉంది. ఈ సమావేశంలో నీతి అయోగ్ సభ్యులు రాజ్ బండారి, న్యూట్రీ హబ్ సీఈవో, శాస్త్రవేత్త బి.దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.