విజయవాడ నవంబర్ 21 (way2newstv.com)
విజయవాడలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాధ్ రెడ్డి గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అకాడమీ కార్యాలయంలో తొలుత పూజాదికాలు గావించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రాష్ట ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టులు హజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పదవి చేపట్టిన శ్రీనాధ్ రెడ్డి ఆయన సేవలను సీఎం జగన్ గుర్తించి,ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించారు. ప్రెస్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెందాలని అన్నారు. శ్రీనాధ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాధ్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీనాధ్ రెడ్డికి అభినందనలు. గతంలో ఏ ప్రభుత్వలు జర్నలిస్టుల కు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. సీఎం జగన్ 6 గురు సీనియర్ జర్నలిస్టుల కు తన ప్రభుత్వం లో పలు పదవులు ఇచ్చారు. 1996 లో ప్రెస్ అకాడమీ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోనిజర్నలిస్టుల కు ప్రెస్ అకాడమీ శిక్షణ ఇచ్చేది. గత కొంత కాలంగా ప్రెస్ అకాడమీ లు నామమాత్రంగా మారాయి. ప్రెస్ అకాడమీ కి స్థలం,నిధులు ఇవ్వాలని అన్నారు.దేవిరెడ్డి శ్రీనాధ్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు. సీఎం జగన్ లో జర్నలిస్ట్ ఉన్నారు. జర్నలిస్ట్ లపై ఆయనకు అపార గౌరవం ఉంది. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తాను. ఫేక్ న్యూస్ ప్రమాదరకరంగా మారాయని వ్యాఖ్యానించారు. జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడింది. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని అన్నారు.
Tags:
Andrapradeshnews