తిరుపతి లడ్డూ ధర భారీ పెంపు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుపతి లడ్డూ ధర భారీ పెంపు..

తిరుపతి నవంబర్ 13  (way2newstv.com)
గుడి ఏదైనా.. స్వామి దర్శనం తర్వాత గుర్తుకు వచ్చేది గుళ్లో ఇచ్చే ప్రసాదమే. ఎన్ని గుళ్లు ఉన్నా తిరుమల శ్రీవారి ఆలయంలో ఇచ్చే లడ్డూ ప్రసాదానికి మించింది మరొకటి ఉండదనే మాట చెబుతారు. తిరుపతి లడ్డూ ప్రసాదం ముందు మరే ప్రసాదమైనా చిన్నబోవాల్సిందే. అందుకే స్వామి వారి దర్శనానికి ఎంత ఆరాటపడతారో.. తిరుమల లడ్డూ ప్రసాదానికి అంతే ఆరాపడతారు. స్వామివారి దర్శనం మనసుకు హాయినిస్తే.. లడ్డూ ప్రసాదంతో జిహ్వకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్వామివారి లడ్డూ ప్రసాదం కారణంగా ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా నస్టాలు వస్తున్నాయి. 
తిరుపతి లడ్డూ ధర భారీ పెంపు....

దీంతో.. ఈ నష్టాన్ని తగ్గించే అంశం మీద కొత్తగా ఏర్పాటైన టీటీడీ బోర్డు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లడ్డూ పంపిణీలో ఉన్న విధానాన్ని సమూలంగా మార్చాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.ఇప్పుడున్న విధానాలతో ప్రతి ఏటా లడ్డూ ప్రసాదం కారణంగా టీటీడీకి వస్తున్న నష్టం అక్షరాల రూ.2412 కోట్లు. దీన్ని తగ్గించే పనిలో పడింది కొత్త బోర్డు. తాజాగా అనుకుంటున్న దాని ప్రకారం స్వామివారి దర్శనం చేసుకునే ప్రతి భక్తుడికి ఒక్కో లడ్డూను ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే.. అదనంగా లడ్డూ కోరుకునే వారికి మాత్రం ఒక్కో లడ్డూను రూ.50 చొప్పున ధరను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు.160-180 గ్రాముల్లో ఉండే స్వామివారి లడ్డూను తయారు చేయటానికి ఇప్పుడు రూ.40 వరకూ పడుతుందని.. ఈ కారణంగా వేలాది కోట్ల నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. అందుకే.. లడ్డూను ప్రతి భక్తుడికి ఉచితంగా ఇచ్చి.. అదనపు లడ్డూ మీద భారీ వడ్డన వేయటం ద్వారా.. నష్టాన్ని వీలైనంత ఎక్కువగా తగ్గించాలన్న ఆలోచనలో టీటీడీ బోర్డు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయానికి టీటీడీ బోర్డులోని సభ్యులంతా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.