రాజనగర్ క్యాంపు లో కార్తీక వన భోజనాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజనగర్ క్యాంపు లో కార్తీక వన భోజనాలు

కౌతాళం నవంబర్ 21 (way2newstv.com)
కార్తీక మాసం పురస్కరించుకుని రాజనగర్ క్యాంపు లో వైసీపీ కార్యకర్తలు వెంకట రామరాజు అద్వర్యం లో కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు.కార్తీక మాసం పురస్కరించుకుని ఉసిరి చెట్టు దగ్గర దేవత మూర్తులను పెట్టి మహిళలు దీపాలు వెలిగించి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ ప్రసాదాలు అందజేశారు. ఉసిరి చెట్టు దగ్గర గ్రామస్తులు అందరికి వన భోజనాలు ఏర్పాటు చేశారు. 
రాజనగర్ క్యాంపు లో కార్తీక వన భోజనాలు

వెంకట రామరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసం పురస్కరించుకుని ఉసిరి చెట్టు దగ్గర పూజలు చేస్తే మంచి జరుగుతుంది.నెల రోజులు దీపాలు వెలిగిస్తారని చెట్టు పై మహా విష్ణువు దేవుళ్లు ఉంటారని  పెద్దలు చెప్పేవారని ఆనవాయితీగా వస్తుంది అని తెలిపారు. ఉసిరి చెట్టు పై దేవతలు ఉంటారని పూజలు నిర్వాహిస్తే గ్రామంలో మంచి జరుగుతుంది అని అపారమైన నమ్మకం అని తెలిపారు.ప్రతి రోజు దీపాలు వెలిగిస్తే మంచి తో పాటు ఆయుష్షు జ్ఞానము లభించును. వనబోజనాలు ఏర్పాట్లు చేయడంతో క్యాంపు లో పండుగ వాతావరణం నెలకొంది. ఉసిరి చెట్టు దగ్గర పూజాలు చేసి ఉసిరి చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.