స్వచ్చ దర్పన్ లో అగ్రస్థానంలో పెద్దపల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్వచ్చ దర్పన్ లో అగ్రస్థానంలో పెద్దపల్లి

 జిల్లా  కలెక్టర్  శ్రీదేవసేన
పెద్దపల్లి    నవంబర్ 01 (way2newstv.com)
 కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చ దర్పన్   మూడవ ఫేస్ ర్యాంకింగ్స్ లో పెద్దపల్లి జిల్లా జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు.  స్వచ్చ  దర్పన్ విభాగంలో అగ్రస్థానం  నిలవడానికి  జిల్లా యంత్రాంగం చేసిన కృషి , ప్రజాప్రతినిధుల సహకారం , ప్రజల భాగస్వామ్యం ఎంతో దోహదం చేసాయని కలెక్టర్ అన్నారు.   ఎల్.ఒ.బి సాధించినందుకు 30%, ప్రతి గ్రామంలో కమ్మూనిటి మరుగుదొడ్లు  నిర్మించినందుకు 15%, మొదటి ఒడిఎఫ్ ధృవీకరణకు 5%,  
స్వచ్చ దర్పన్ లో అగ్రస్థానంలో పెద్దపల్లి

దివ్యాంగుల కోసం మరుగుదొడ్లు నిర్మించడం, జియోట్యాగింగ్ కు 5% ,  రాయితి సోమ్ము చెల్లించినందుకు 5%, ఒడిఎఫ్ ప్లస్ అవగాహన కల్గించడం 5%  , స్వచ్చతా హి సేవా కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి 5%,   ప్లాస్టీక్ సేకరణ శ్రమదాన నిర్వహిణ, ప్లాస్టిక్ డిస్పోసల్ కు 10%,  కమ్యూనిటి / వ్యక్తిగత కాంపోస్ట్ పిట్ల నిర్మాణానికి 20%  పాయింట్లు సాధించి  పెద్దపల్లి జిల్లా   మన రాష్ట్ర స్థాయిలో, అదే విధంగా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందని,    రాష్ట్రంలోని  రాజన్న సిరిసిల్ల, వరంగర్, ఖమ్మం, మంచిర్యాల జిల్లాలు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాయని,  మన రాష్ట్రం నుండి పెద్దపల్లి జిల్లా  కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న ప్రతి  స్వచ్చత పోటీలలో అగ్రభాగంలో నిలవడం పట్ల   రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,  రాష్ట్రంలోని ఉన్నతాధికారులు జిల్లాయంత్రాంగాని అభినందిస్తూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారని కలెక్టర్ తెలిపారు.