వినతులకు సత్వర పరిష్కారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వినతులకు సత్వర పరిష్కారం

కర్నూలు, నవంబర్ 02,(way2newstv.com):
ప్రజా వినతులను సత్యరమే పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్  జి.వీరపాండియన్ జిల్లా అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనం నుండి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9.30 నుండి 10.30  గంటల వరకు ఫోన్ ద్వారా ప్రజలనుండి వచ్చిన 26 సమస్యలను విన్నారు. వెంటనే అ సమస్యలను పరిష్కరించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి గైర్హాజరు అయిన అధికారులకు వెంటనే షోకాజ్ నోటీస్ జారీ చేయాలని డిఆర్ ఓను ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానంతరం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడుతూ డయల్ యువర్ కలెక్టర్, స్పందన, ఎస్పీ-ఎస్టీ, అవుట్ సోర్సింగ్, కంట్రాక్టు,  ఉద్యోగుల గ్రీవెన్సీ  కార్యక్రమాలలో   ప్రజల నుంచి  వివిధ సమస్యలపై  వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించేందుకు  అధికారులందరూ సీరియస్ గా తీసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 
వినతులకు సత్వర పరిష్కారం

డయల్ యువర్ కలెక్టర్ సమస్యల పరిష్కారంపై చేపట్టిన చర్యలను సంబంధిత ఫిర్యాదుదారులకు వివరించాలని అయన అధికారులకు సూచించారు. స్పందనలో వచ్చిన అర్జీలు 12 శాతం రిజెక్ట్ కింద ఉన్నాయని, చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేయకుండా పరిశీలించి అర్జీ దారులతో మాట్లాడి వాలకు న్యాయం చేయాలన్నారు.  ఒకవేళ ఏదైనా అర్జీని అన్నివిధాలా పరిశీలించిన పిదప కూడా పరిష్కరించాడానికి వీలుకాకపోతే  సరైన కారణాలను  ఎండార్స్ మెంట్ ద్వారా అర్జీదారులకు తెలియజేపాలని కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై నగరాలలో 130 మల్టీ సూపర్ స్పెషాలిటి అసుపత్రులలో ఆరోగ్యశ్రీ పథకం వర్తించేలా రాష్ట్ర ముక్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు  జారీ  చేస్తారన్నారు.  ఈ  విషయాన్ని అన్ని ప్రభుత్వ అసుపత్రులలో వాల్ పోస్టర్లు ఏర్పాటు  చేసి విస్తృత ప్రచారం చేయాలన్నారు.  నవబంర్  20 నుండి ప్రపంచ అరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ప్రభుత్వ అసుపత్రిలో 500  రకాల మాత్రలు, మందులను రోగులకు ఉచితంగా ఇవ్వాలన్నారు. నవంబర్ 14 తేది చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని  ప్రభుత్వ పాఠశాలలో తొలివిడత నాడు-నేడు కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లా మంత్రులు, ఎంపి, ఎమ్మోల్యేలను ఆహ్వానించాలన్నారు. వచ్చే ఏడాది 1వ తరగతి నుంచి 8వ తరగతి  వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో  ఆంగ్లంలో బోధనతో  పాటు తెలుగు  ఖచ్చితంగా బోధించేలా చర్యలు చేపటాలని విద్యా శాఖాధికారులను  అదేశించారు. 10 వేల రూపాయలు డిపాజిట్ చేసిన  అగ్రిగోల్డ్  బాధిత కుటుంబాలకు తొలివిడతగా  నవంబర్ 7న జిల్లా కేంద్రాంలో  ప్రజా ప్రతినిధుల సంక్షంలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అత్మకూరు, ఆళ్లగడ్డ, గూడూరు మండలాలలో వేస్ట్ మేనేజ్ మెంట్  ప్లాంట్ స్థలాలను కేటాయించాలని ని  ఆదేశించారు. నవంబర్ 7న జిల్లా స్థాయి డిఆర్ సి సమావవేశం ఉంటుందని, సమావేశానికి జిల్లా ఇంచార్జి మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు. నవంబర్ 15న స్పందన పై సునయనా అడిటోరియంలో అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు సియంఓ అఫీసు నుంచి ఉన్నతాధికారులు రానున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ  కార్యక్రమంలో జెసి రవి పట్టాన్ శెట్టి, జాయింట్  కలెక్టర్-2 సయ్యద్ ఖాజామోహిద్దీన్, డిఆర్ ఓ పుల్లయ్య, తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.