సుమ ఛాలెంజ్ స్వీక‌రించిన మంచు ల‌క్ష్మీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సుమ ఛాలెంజ్ స్వీక‌రించిన మంచు ల‌క్ష్మీ

హైద్రాబాద్, నవంబర్ 28  (way2newstv.com)
రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. న‌వంబర్ 13న ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మూడు మొక్క‌లు నాటారు. అనంతరం జూనియర్‌ ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, మంచు లక్ష్మీ, యాంకర్‌ ఓంకార్‌కు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసిరారు. 
సుమ ఛాలెంజ్ స్వీక‌రించిన మంచు ల‌క్ష్మీ

సుమ ఛాలెంజ్‌ని స్వీక‌రించిన మంచువార‌మ్మాయి త‌న ఇంట్లో మొక్క నాటారు. పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో భాగం అయినందుకు సంతోషంగా ఉంద‌ని మంచు ల‌క్ష్మీ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ చాలా ముఖ్య‌మైన‌ది.ఎన్ని చెట్లు నాటితే అంత మంచిది. ఇది నిరంత‌రాయంగా కొన‌సాగాలి. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా.. మంచు మ‌నోజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌ల‌కి తాను ఛాలెంజ్ విసురుతున్న‌ట్టు తెలిపింది మంచు ల‌క్ష్మీ.